హైదరాబాద్ సిటీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలే టార్గెట్ గా చైన్ స్నాచింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. బుధవారం (ఫిబ్రవరి 11) అబిడ్స్ ప్రాంతంలో మరో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. చాపెల్ రోడ్డులోని మల్లారెడ్డి ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న శిరీష అనే మహిళ విధులు ముగించుకుని హాస్టల్‌కు వెళ్తుండగా ఈ దాడి జరిగింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు.
చైన్ లాక్కెళ్లే సమయంలో దుండగులు ఆమెను బలంగా లాగడంతో శిరీషకు గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
ఇటీవలి కాలంలో నగరంలో ఇలాంటి ఘటనలు పెరుగుతుండటంతో మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు.
