ఏడుపు మీ ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా ? కన్నీళ్ల వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

ఏడుపు మీ ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా ? కన్నీళ్ల వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

చాలా మంది ఏడవడాన్ని బలహీనతగా(weakness) లేదా చిన్నపిల్లల చేష్టగా భావిస్తారు. ముఖ్యంగా మన సమాజంలో కన్నీళ్లను దాచిపెట్టడమే గొప్ప అని నమ్ముతారు. కానీ, ఏడవడం అనేది శారీరకంగా, మానసిక ఆరోగ్యానికి చాలా అవసరమని ప్రముఖ మానసిక వైద్యులు వివరిస్తున్నారు.

ఏడుపు  మాటల్లో చెప్పలేనంత బాధ, సంతోషం లేదా ఒత్తిడి కలిగినప్పుడు కన్నీళ్లు ఒక  భావోద్వేగాన్నీ చూపిస్తాయి. మనం ఎవరి సహాయం లేదని స్థితిలో ఉన్నప్పుడు, మనకు ఇతరుల సహాయం అవసరమని చెప్పడానికి కన్నీళ్లు ఒక సంకేతం. ఏదైనా విషయాన్ని మనం బలంగా అనుభవిస్తున్నప్పుడు సహజంగానే కన్నీళ్లు వస్తాయి.

ఏడవడం వల్ల కలిగే ప్రయోజనాలు
పరిశోధనల ప్రకారం, ఏడవడం వల్ల శరీరంలో ఒత్తిడిని కలిగించే హార్మోన్లు తగ్గుతాయి. అందుకే ఏడ్చిన తర్వాత చాలా మందికి మనసు తేలికగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలా మనస్సును మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావడానికి సహాయపడుతుంది.

ఏడుపు అంటే కేవలం దుఃఖమే కాదు. ఏదైనా గొప్ప  విజయం సాధించినప్పుడు, ఎవరైనా ఆత్మీయులను కలిసినప్పుడు వచ్చే కన్నీళ్లు ఆనందభాష్పాలు,  ఇవి ఆరోగ్యకరమైనవే. ఏడ్చి మనసులోని భారాన్ని దించుకున్న తర్వాత, చాలామంది మరింత స్పష్టంగా ఆలోచించగలుగుతారు.

►ALSO READ | Good parenting:  పిల్లలకు ఈ విషయాలు నేర్పించండి..లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడతారు..!

 ఏడవడం మంచిదే అయినా, కొన్ని సందర్భాల్లో ఏడుపు ఆరోగ్య సమస్యకు కూడా సంకేతం కావచ్చు. ఎటువంటి కారణం లేకుండా పదే పదే ఏడుపు వస్తుంటే అది డిప్రెషన్ లేదా ఆందోళనకు సంకేతం కావచ్చు. ఏడుపు అస్సలు ఆగకపోవడం, మీలో శూన్యంగా అనిపించడం వంటివి ఉంటే వైద్య నిపుణుల సహాయం తీసుకోవాలి. శారీరక సమస్యలు, కళ్లలో ఇబ్బంది వల్ల నీళ్లు కారుతుంటే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

ఏడుపు లేదా కన్నీళ్లకు భయపడాల్సిన పని లేదు. కానీ అవి మన మనసును క్లీన్ చేసే ప్రక్రియలో భాగం. ఏడవడం బలహీనత కాదు, అది మీరు ఒక మనిషిగా మీ భావాలను గౌరవిస్తున్నారని చెప్పడానికి గుర్తు.