క్యాన్సర్ బాధిత చిన్నారులకు డ్రాయింగ్ పోటీలు

క్యాన్సర్ బాధిత చిన్నారులకు డ్రాయింగ్ పోటీలు

పంజాగుట్ట, వెలుగు: అంతర్జాతీయ బాల్య క్యాన్సర్ డేను పురస్కరించుకొని మంగళవారం నిమ్స్ హాస్పిటల్​లో క్యాన్సర్‌తో బాధిత చిన్నారులకు డ్రాయింగ్​ పోటీలు నిర్వహించారు. నిమ్స్ మెడికల్ ఆంకాలజీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్.ఆర్. ఫౌండేషన్ చైర్మన్ సుధా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిన్నారులకు ధైర్యం, ఆనందం కలిగించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.