నల్గొండ జిల్లాలో రూ.15 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ ఇన్స్పెక్టర్

నల్గొండ జిల్లాలో రూ.15 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ ఇన్స్పెక్టర్

నల్గొండ: నల్లగొండలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ పవన్ కుమార్ ఏసీబీ వలకు చిక్కాడు. భూ సర్వే నివేదిక జారీకి లంచం డిమాండ్ చేసిన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ను ACB అరెస్ట్ చేసింది. మొత్తం రూ.35 వేల లంచం కోరినట్లు ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర వివరించారు. ముందుగానే రూ.20 వేల అడ్వాన్స్ తీసుకున్నాడు. 

రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ACB అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నల్లగొండ కలెక్టరేట్ సమీపంలో ఏసీబీ పన్నిన వలకు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ చిక్కడం గమనార్హం. నిందితుడి వద్ద నుంచి రూ.15 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఏసీబీ అధికారులు ఆర్డీఓ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. విధుల నిర్వహణలో అక్రమ ప్రయోజనం పొందినట్లు నిర్ధారణ అయింది. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ను ఏసీబీ అరెస్ట్ చేసింది. నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో అధికారులు హాజరుపరచనున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ వెల్లడించింది. లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫిర్యాదు చేయాలని సూచించింది. అవినీతిపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఏసీబీ హెచ్చరించింది.

►ALSO READ | గండిపేట భూముల కేసులో బొల్లా బ్రహ్మనాయుడుకు బెయిల్...