- ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ అవుతూనే ఉంది
- ఎక్విప్మెంట్ వాళ్ల దగ్గరే ఉన్నట్టుంది
- దీనిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటది
- ఎంత మంది ఎక్కడి నుంచి వింటున్నారనేది ఎంక్వైరీ చేస్తం
- వారిపైనా చట్ట రీత్యా చర్యలు ఉంటాయ్
- ప్రజాస్వామ్య స్వేచ్ఛకు భంగం కలిగిస్తే వదిలిపెట్టం
- మున్సిపల్ఎన్నికల్లో 80 శాతానికి పైగా సీట్లు గెలుస్తం
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యా ఖ్యలు చేశారు. తన ఫోన్ ను బీఆర్ఎస్ ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. తాను అధికారులతో మాట్లాడిన టెలి కాన్ఫరెన్స్ విషయాలు వాళ్లకు తెలిసిపోతున్నాయని అన్నారు. మామిడి తోటనో, ఫామ్ హౌస్ నో ఉండి పోస్ట్యాపింగ్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎక్విప్మెంట్ ఇంకా గులాబీ లీడర్ల వద్దే ఉన్నట్టుందని.. దీన్ని ప్రభు త్వం సీరియస్ గా తీసుకుంటుందని తెలిపారు. ఖమ్మంలో పొంగులేటి మాట్లాడుతూ 'ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, జరు గుతోందని అనేక మంది గగ్గోలు పెడుతున్నారు... ఇది అక్షరాలా నిజం.
ఇప్పటికీ నా ఫోన్ ట్యాపింగ్ అవుతూనే ఉంది. ఎంత మంది ఎక్కడి నుంచి ఏం టున్నారనేది ఎంక్వైరీ చేస్తం. సామాస్యుల నుంచి సొంత కుటుంబ సభ్యుల (అల్లుడు, డూతురు) ఫోన్ల వరకు ట్యాప్ చేయించారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ఆధారాలతో ఉన్నాయి. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలే రు. అసభ్య పదజాలలతో మాట్లాడే వారికి ప్రజలే బుద్ధి చెబుతరు. నేను సీఎం రేసులో లేను. కేవలం కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్తను మాత్రమే. ఉన్న జిల్లాలు తగ్గించేది లేదని సీఎం
రేవంత్ స్పష్టంగా చెప్పారు.
కమిటీ వేసి, అసెంబ్లీ చర్చ తర్వాత మార్పులు చేర్పులు ఉంటాయి. శాసనసభకు ఆరోజు అయినా ప్రధాన ప్రతి పక్షనేత రావాలి' అని పొంగులేటి కోరారు.
80 శాతానికి పైగా సీట్లు గెలుస్తం
గ్రామ పంచాయతీల తరహాలోనే, మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో 80 శాతానికిపైగా సీట్లు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని గత రెండేండ్లుగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజాప్రభుత్వం నెరవేరుస్తున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 8.19 లక్షల కోట్లు అప్ప చేసిందన్నారు. దాని కోసం ప్రతి నెలా 6,300 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామన్నారు.
జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ నేతలు, మాజీ మంత్రులు మాట్లాడిన మాటలు అందరికీ గుర్తున్నాయని చెప్పారు. ఆ ఉప ఎన్నికల ఫలితం కాంగ్రెస్ పాలనకు రిఫరెండం అని బీఆర్ఎస్ నేతలే అన్నారు. సెమీఫైనల్ అని, రెఫరెండం అని వాళ్లు చెప్పారు. ఆ ఫలితం అందరూ చూసారన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇండ్ల స్థలాలు లేని పేదలకు జీ ప్లస్ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు. దీనికి ప్రణాళికలు రచించామన్నారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి చేసి పేదలకు ఇస్తామన్నారు.
'పరి వేస్తే ఉరి' అన్న కాలం పోయి, ఇప్పుడు వద్దకు బోనస్ ఇస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని వివరించారు. మాజీ మంత్రుల అసభ్య పదజాలానికి ప్రజలు ఓటు ద్వారానే తగిన గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు.
