యంత్ర ఇండియా లిమిటెడ్ (వైఐఎల్) దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ఇండియన్ ఆర్డినెన్స్, ఆర్డినెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో 59వ బ్యాచ్ కోసం ట్రేడ్ అప్రెంటీస్‌లను (ఎక్స్- ఐటీఐ & నాన్ -ఐటీఐ అభ్యర్థులు) నియమించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ మార్చి 03.
ఖాళీలు: 3979.
విభాగాల వారీగా ఖాళీలు: ఎక్స్– ఐటీఐ ట్రేడ్ అప్రెంటీస్ 2843, నాన్– ఐటీఐ ట్రేడ్ అప్రెంటీస్ 1136.
ఎలిజిబిలిటీ
నాన్ ఐటీఐ అభ్యర్థులు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి (మాధ్యమిక్/మెట్రిక్యులేషన్)లో పూర్తిచేసి ఉండాలి. గణితం, సైన్స్‌లో 40 శాతం మార్కులు సాధించి ఉండాలి.
ఎస్స్ ఐటీఐ అభ్యర్థులు: గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఐటీఐలో ఉత్తీర్ణులై ఉండాలి, 10వ తరగతిలో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.
వయోపరిమితి: 14 నుంచి 35 ఏండ్ల మధ్యలో ఉండాలి .కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 01.
లాస్ట్ డేట్: మార్చి 03.
అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్, ఓబీసీ అభ్యర్థులకు రూ.200. ఎస్సీ, ఎస్టీ, మహిళ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100.
సెలెక్షన్ ప్రాసెస్: పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత తుది జాబితాను ప్రచురిస్తారు.
పూర్తి వివరాలకు recruit-gov.com
వెబ్‌సైట్‌ను సందర్శించండి.
►ALSO READ | టెన్త్ పాసైన వారికి గుడ్ న్యూస్.. HVF AVNL లో జూనియర్ టెక్నీషియన్ పోస్టులు
