- సహకరించని రక్షణశాఖ,
- ఇతర శాఖల అధికారులు
హైదరాబాద్‌సిటీ, వెలుగు : హెచ్ఎండీఏ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న రోప్ వే ప్రాజెక్టుకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు వివిధ శాఖల అధికారులు సహాయ నిరాకరణ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో ఎలా ముందుకు పోవాలో తెలియక హెచ్ఎండీఏ సందిగ్ధంలో పడింది.
నగరంలో టూరిస్టులను ఆకట్టుకునేందుకు గోల్కొండ నుంచి కుతుబ్‌షాహీ టూంబ్స్వరకూ 1.5 కి.మీ. మేర రోప్‌వే నిర్మించి కేబుల్కార్నడపాలని హెచ్ఎండీఏలోని ఉమ్టా ఆఫీసర్లు ప్లాన్లు వేశారు. ఈ ప్రాజెక్టుకు రూ.100 కోట్లు ఖర్చు కాగలవని అంచనా వేశారు. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై డీపీఆర్ఇవ్వాలని నైట్ఫ్రాంక్సంస్థను సెలెక్ట్చేశారు. అయితే, ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలు, భూసేకరణపై నివేదిక తయారు చేసేందుకు ఆ సంస్థ నిర్వహిస్తున్న కార్యకలాపాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.
చర్చలకూ ఇష్టపడని రక్షణ శాఖ
గోల్కొండ నుంచి కుత్షాహీ టూంబ్స్వరకూ భూసేకరణ కష్టమైన వ్యవహారంగా మారింది. ఎందుకంటే లంగర్‌హౌస్‌లో ఆర్మీ ఆర్టిలరీ సెంటర్ఉంది. ఇక్కడి ఆర్మీ సిబ్బంది గోల్కొండ కోట చుట్టూ ఫైరింగ్తదితర ట్రైనింగ్‌లో పాల్గొంటారు. దీంతో రక్షణ శాఖ అధికారులు కనీసం చర్చలు జరపడానికి కూడా ఇష్టపడడం లేదు. వీరితో పాటు ఆర్కియాలజీ, ఆర్అండ్బీ డిపార్ట్మెంట్లు కూడా సర్వే పనులకు సహకరించడం లేదు.
రోజుకు 10వేల మంది
గోల్కొండ, కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను చూడడానికి రోజుకు 10వేల మంది వరకు వస్తుంటారు. ఇందులో 2వేల మంది విదేశీయులు ఉంటున్నారు. హెచ్ఎండీఏ అనుకున్నట్టు రోప్‌వే ఏర్పాటు చేస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు రెండువైపులా కాఫీ షాప్‌లు, ఫుడ్‌కోర్టులు, ఎంటర్టైన్మెంట్కార్యకలాపాలను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. కానీ, ఇప్పుడు డీపీఆర్తయారీకి చేపట్టాల్సిన సర్వే పనులకే ఆయా శాఖల నుంచి సహకారం లభించకపోవడంతో అధికారులు ఏం చేయాలా అని తర్జన భర్జన పడుతున్నారు.
