పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద డీలాపడిపోయింది. ఆల్మోస్ట్ థియేటర్ రన్ ముగిసినట్టే అని ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో మిక్స్‌డ్ టాక్‌తో రన్ అవుతోంది. భారీ అంచనాల మధ్య మార్చి 19న విడుదలైన ఈ సినిమా తొలి వారం ఓ మోస్తరు కలెక్షన్స్ సాధించినప్పటికీ, తర్వాత రోజురోజుకీ ఆక్యుపెన్సీ తగ్గుతూ వచ్చింది.
ఈ క్రమంలోనే ఉస్తాద్ భగత్ సింగ్' వంది కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవుతుందా? లేదా? అనేది ట్రేడ్ వర్గాల్లో చర్చనియాంశమైంది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.94.38 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, ఇండియాలో రూ.70 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ నమోదైనట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రస్తుత ట్రెండ్ చూస్తే, 100 కోట్ల మార్క్ చేరుకోవడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మొదటి వారం జోరు.. రెండో వారం స్లోడౌన్
‘ఉస్తాద్ భగత్ సింగ్’ తొలి వారం (7 రోజులు)లో సుమారు రూ.65.95 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే, రెండో వారం ప్రారంభమైన తర్వాత కలెక్షన్స్‌లో వేగం తగ్గిపోయి, బాక్సాఫీస్ వద్ద కష్టపడుతోంది.
8వ రోజు: రూ.1.00 కోటి
9వ రోజు: రూ.1.10 కోటి
10వ రోజు: రూ.86 లక్షలు
11వ రోజు : (రెండవ ఆదివారం)= రూ.1.03 కోట్లు కలెక్షన్స్ సాధించింది.
12వ రోజు : (రెండవ సోమవారం) కేవలం 35 లక్షలు మాత్రమే వచ్చాయి.
ఈ ట్రెండ్ చూస్తే, సినిమా బాక్సాఫీస్ వద్ద స్ట్రగుల్ అవుతున్నట్టు స్పష్టమవుతోంది.
బడ్జెట్ & బ్రేక్ ఈవెన్ లెక్కలు
‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి సుమారు రూ.150 కోట్ల బడ్జెట్ ఖర్చైనట్లు సమాచారం. ఇందులో నటీనటులు, టెక్నీషియన్స్ పారితోషికాలు, నిర్మాణ ఖర్చులు, ప్రమోషన్ వ్యయాలు ఉన్నాయి. కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ 12 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేశాయి. ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.137 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది.
ప్రీ రిలీజ్ బిజినెస్
నైజాం: రూ.50 కోట్లు
ఆంధ్రా: రూ.54 కోట్లు
సీడెడ్: రూ.16 కోట్లు
కర్ణాటక: రూ.5 కోట్లు
ఓవర్సీస్: రూ.12 కోట్లు
మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.137 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదైంది.
ఈ లెక్కల ప్రకారం, సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.138 కోట్ల నెట్, దాదాపు రూ.276 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో టార్గెట్‌ను చేరుకోవడానికి ఇంకా సుమారు రూ.40 కోట్ల వరకు కలెక్షన్స్ అవసరమని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
►ALSO READ | నేను తగ్గను.. నా దారి నాదే.. విమర్శలకు మెగా డాటర్ స్ట్రాంగ్ కౌంటర్!
మొదటి వారం తర్వాత కలెక్షన్స్ పడిపోవడం, ఆక్యుపెన్సీ తగ్గడం వంటి అంశాలు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లక్ష్యాన్ని చేరుకోవడాన్ని కష్టతరం చేస్తున్నాయి. 100 కోట్ల క్లబ్ చేరుతుందా లేదా అన్నది ఇప్పటికీ అనుమానంగానే మిగిలింది.
'ధురంధర్ 2' నుంచి గట్టి పోటీ
మరోవైపు, ఉస్తాద్ కు పోటీగా వచ్చిన బాలీవుడ్ ఫిల్మ్ 'ధురంధర్: ది రివెంజ్' భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ విడుదలైన 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,392.23 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇవాళ్టితో రూ.1400 కోట్ల మార్క్ అందుకోనుంది.
