
హీరో వైష్ణవ్ తేజ్(VaishnaviTej)..సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) జోడీగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆదికేశవ(Aadikeshava).లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి హే బుజ్జి బంగారం(HeyBujjiBangaram) లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ చాలా రిఫ్రెషింగ్గా సాగుతూ మొదలవ్వగా.. శ్రీలీల, వైష్ణవ్ తేజ్ డ్యాన్స్ మూమెంట్స్అదిరిపోయేలా ఉన్నాయి.
జీవీ ప్రకాశ్అందించిన మ్యూజిక్మెలోడీ..రొమాంటిక్ ఫీల్, ఫ్రెష్ వైబ్స్అందించేలా ఉన్నాయి. సరస్వతి పుత్ర రామజోగయ్యా శాస్త్రి(RamaJogayya Sastry) అందించిన లిరిక్స్ ఆకట్టుకోగా..ఆర్మాన్ మాలిక్, యామిని ఘంటశాల పాడారు. అంతేకాకుండా పాట చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది.
ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రియల్ ఇన్సిడెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ..వైష్ణవ్ తేజ్ ఖాతాలో సక్సెస్ ను అందించేలా కనిపిస్తోంది. లవ్, యాక్షన్, కోలార్ మైనింగ్ కాన్సెప్ట్స్ తో మూవీ వస్తుండటంతో వైష్ణవ్ తేజ్ హై లెవెల్ హోప్స్ పెట్టుకున్నట్లు సమాచారం.
డైరెక్టర్ శ్రీకాంత్ ఎన్. రెడ్డి ఈ చిత్రాన్ని ఓ గుడి చుట్టూ సాగే కథతో తెరకెక్కిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.రుద్ర కాళేశ్వర్ రెడ్డిగా పవర్ ఫుల్ క్యారెక్టర్ లో వైష్ణవ్ తేజ్ కనిపించనున్నారు. మలయాళ యాక్టర్ జోజు జార్జ్, అపర్ణాదాస్, రాధిక కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్పై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆది కేశవ మూవీని దీపావళి స్పెషల్ గా నవంబర్ 10న గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్ .