ఫ్యామిలీ ఆడియన్స్ను మెస్మరైజ్ చేస్తోన్న.. లియో థర్డ్ సింగిల్

ఫ్యామిలీ ఆడియన్స్ను మెస్మరైజ్ చేస్తోన్న.. లియో థర్డ్ సింగిల్

కోలీవుడ్ స్టార్‌ హీరో దళపతి విజయ్ (Vijay) హీరోగా నటిస్తున్న చిత్రం లియో(Leo.. Bloody Sweet). బ్యూటీ త్రిష హీరోయిన్‌గా నటిస్తుండ‌గా..లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్,టీజర్,ట్రైలర్,సాంగ్స్ తో లియో మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

లేటెస్ట్గా ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్..ప్రేమ ఓ ఆయుధం(Prema Oh Ayudham) సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ మెలోడీస్గా ఉండటంతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. రాసిచ్చాలే మనస్సే..చేసేస్తాలే తపస్సే..ప్రేమ ఓ ఆయుధం లేని..మొనగాడి గుండెలో అంటూ సాగిన ఈ మెలోడీ గీతాన్ని కృష్ణ కాంత్(Krishna Kanth) రచించగా..జె.వి.సుధాన్షు, ప్రియా మాలి పాడారు. అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) అందించిన ట్రెమెండిస్ ట్యూన్ ..ఫ్యామిలీ ఆడియన్స్ను మెస్మరైజ్ చేస్తుంది.

ఈ మూవీ నుంచి వచ్చిన  నా రెడీ సాంగ్, లియో బాదాస్ సాంగ్స్..మాస్ ఆడియన్స్కు ఫుల్ కిక్ ఇవ్వగా..లేటెస్ట్ ప్రేమ ఓ ఆయుధం ఫ్యామిలీ ఆడియన్స్కు మంచి మెలోడీ అందించేలా ఉంది. ఇక లియో తెలుగు ప్రీ రిలీజ్​ ఈవెంట్ను హైద‌రాబాద్‌లో నిర్వహించడానికి మేక‌ర్స్ ప్లాన్​ చేస్తున్నారని స‌మాచారం. 

 ALSO READ : డార్లింగ్ ప్ర‌భాస్ బ‌ర్త్ డేకి ట్రిపుల్ ట్రీట్!..గెట్ రెడీ ఫ్యాన్స్
 

లియోలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్‌దత్‌, యాక్షన్‌ కింగ్ అర్జున్ తో పాటు ప్రియా ఆనంద్‌, మన్సూర్ అలీఖాన్‌, గౌతమ్ మీనన్‌, మిస్కిన్‌, మాథ్యూ థామస్‌, సాండీ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. లియో మూవీని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మిస్తుండగా.. దసరా సందర్బంగా పాన్ ఇండియా వైడ్గా అక్టోబర్ 19న రిలీజ్ చేస్తున్నారు