డార్లింగ్ ప్ర‌భాస్ బ‌ర్త్ డేకి ట్రిపుల్ ట్రీట్!..గెట్ రెడీ ఫ్యాన్స్

డార్లింగ్ ప్ర‌భాస్ బ‌ర్త్ డేకి ట్రిపుల్ ట్రీట్!..గెట్ రెడీ ఫ్యాన్స్

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్(Prabhas) అంటే అటు కుర్రాళ్ళకి..ఇటు అమ్మాయిలకి స్పెషల్ క్రేజీ ఉంటుందని చెప్పక్కర్లేదు. త్వరలో ప్రభాస్ నుంచి వరుస అప్డేట్స్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ నెల (అక్టోబర్ 23న) ప్రభాస్ బ‌ర్త్ డే ఉండటంతో..ఫ్యాన్స్కు పండ‌గనే చెప్పుకోవాలి. ప్రభాస్ నుంచి వరుస సినిమాలు వస్తుండటంతో..అదిరిపోయే స్పెష‌ల్ ట్రీట్ ఉంటుంద‌ని..ఫ్యాన్స్ హై లెవెల్ ఎక్సపెక్టషన్స్ పెట్టుకున్నారు.
 
ప్రభాస్ మూవీస్ విషయానికి వస్తే..అందులో మూడు సినిమాలు సెట్స్లో ఉండ‌టంతో..ట్రీట్ ఇంకా స్పెష‌ల్గా ఉండబోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. హ్యూమర్ టచ్తో తనదైన కామెడీ సినిమాలను తీసే..టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి మూవీకు సంబంధించిన పోస్టర్..రిలీజ్ చేసే అవకాశం ఉండగా..అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తోన్న..సలార్ నుంచి ట్రైలర్ రిలీజ్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక సంక్రాంతి బరిలో ఉన్న కల్కి మూవీ నుంచి కూడా స్పెషల్ ట్రీట్ ఉండే ఉంటుందని ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.

అంతేకాకుండా..అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వస్తోన్న స్పిరిట్ మూవీ నుంచి ఏదైనా అప్డేట్ వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. ఇక మరో పది రోజుల్లో..ప్రభాస్ బర్త్డే వేడుకలు వస్తుండటంతో మేకర్స్..ఫ్యాన్స్ ఆశ‌లు తీరుస్తారా? లేదా? అన్న‌ది తెలియాల్సి ఉంది. 

 ALSO READ : మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి దర్శకుడు మహేష్ బాబుకు.. ట్రెండింగ్ డైరెక్టర్ అవార్డు

డార్లింగ్ బర్త్డే వేడుకలు ఈసారి విదేశాల్లోనే ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. అందుకు తగిన ఏర్పాట్లు కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే హైద‌రాబాద్ నుంచి త‌న స్నేహితులంతా అక్టోబర్ 23 క‌ల్లా ఫారిన్ లో ఉండేటట్లు ప్లాన్ చేసుకుంటున్నారుట‌.

రీసెంట్గా ప్రభాస్ కాలికి గాయం అవ్వడంతో..కొన్ని రోజులుగా ప్ర‌భాస్ విదేశాల్లోనే ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆరోగ్యం...స‌ర్జ‌రీ అంతా స‌క్సెస్ అయినప్పటికీ..హైద‌రాబాద్కి రిటర్న్ అవ్వలే. దీంతో ఫారెన్లో ప్రభాస్ బర్త్డే వేడుకలు జరగనున్నట్లు టాక్ వినిపిస్తోంది.