స్టార్ బాయ్తో బేబీ బ్యూటీ కొత్త సినిమా.. ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!

స్టార్ బాయ్తో బేబీ బ్యూటీ కొత్త సినిమా.. ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!

బేబీ(Baby) సినిమాతో టాలీవుడ్ లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన యూట్యూబ్ బ్యూటీ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya). ఈ సినిమాలో తన నటనతో టాలీవుడ్ ఇండస్ట్రీని తనవైపుకి తిప్పుకుంది వైష్ణవి. దీంతో బడా నిర్మాణ సంస్థల నుండి వరుస ఆఫర్స్ అందుకుంది అనే వార్తలు వినిపించాయి. కానీ, ఆమె నటిస్తున్న ఒక్క ప్రాజెక్టు గురించి కూడా అధికారిక ప్రకటన రాలేదు. దీంతో వైష్ణవి నటించబోయే తరువాత సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. 

ఇందులో భాగంగా వైష్ణవి చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీపై అధికారిక ప్రకటన వచ్చేసింది. బొమ్మరిల్లు దర్శకుడు బొమ్మరిల్లు దర్శకత్వంలో స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వరా సినీ క్రియేషన్స్ పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా మొదలైంది. ఈ సినిమాలో సిద్దు పక్కన వైష్ణవి చైతన్యను ఫిక్స్ చేశారు మేకర్స్. తాజాగా జనవరి 4న వైష్ణవి చైతన్య పుట్టునరోజు సందర్బంగా విషెష్ తెలుపుతూ ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. బ్లాక్ డ్రెస్ లో ముస్లిం పాత్రలో కనిపిస్తున్న వైష్ణవి ఫస్ట్ లుక్ ఆడియన్స్ నుయ్ తెగ ఆకట్టుకుంటోంది. దీంతో ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైష్ణవి చైతన్య రెండో సినిమాపై అధికారిక ప్రకటన రావడంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుసీ అవుతున్నారు. 

ఈ సినిమానే కాకుండా మరో రెండు సినిమాలను కూడా లైన్లో పెట్టింది వైష్ణవి చైతన్య. అందులో దిల్ రాజు బ్యానర్ ఆశిష్ హీరోగా వస్తున్న సినిమా ఒకటి. రెండోది దర్శకుడు సాయి రాజేష్ ఆనంద్ దేవరకొండతో చేస్తున్న సినిమా మరొకటి. ఈ రెండు సినిమాల షూటింగ్ లు కూడా త్వరలోనే మొదలుకానున్నాయి. మరి వైష్ణవి చైతన్య చేస్తున్న ఈ క్రేజీ సినిమాలు ఎలాంటి విజయాన్ని అందుకోనున్నాయో చూడాలి.