Kaadal the Core: ఓటీటీలోకి మెగాస్టార్ గే మూవీ..కానీ వారికి మాత్రమే.!

Kaadal the Core: ఓటీటీలోకి మెగాస్టార్ గే మూవీ..కానీ వారికి మాత్రమే.!

మలయాళ మెగాస్టార్ హీరో మమ్ముట్టి (Mammootty) నటించిన ఎమోషనల్‌ డ్రామా కాథల్-ది కోర్‌ (Kadal The Core). ఈ సినిమాలో మమ్ముట్టికి జోడిగా జ్యోతిక (Jyothika) నటించి మెప్పించింది. జో బేబి డైరెక్ట్ చేస్తోన్న చేసిన ఈ మూవీ నవంబర్ 23న థియేటర్లో రిలీజ్ అయ్యి..మంచి సక్సెస్ అందుకుంది. బాక్సాఫీస్ వ‌ద్ద ఏకంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.దీంతో ఓటీటీలోకి  ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..కాదల్ ది కోర్ మూవీ ఓటీటీలోకి రాకముందే చూడొచ్చట. ఓవర్సీస్ ప్రేక్షకులకు ఈ సినిమా అద్దె రూపంలో అందించడానికి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో యాజమాన్యం..పే అండ్ వ్యూ పద్ధతి తీసుకున్నట్లు సమాచారం. ఇలా ఈ సినిమాను ఓ 15 రోజుల వరకు పే అండ్ వ్యూ పద్దతిలోనే చూడొచ్చని తెలుస్తోంది.

ఈ సినిమా ఆఫీసియల్ గా అందరికీ అందుబాటులోకి రావడానికి ఇంకాస్తా టైం పడుతుండటంతో..ఫ్యాన్స్ రిక్వెస్ట్ మేరకు అమెజాన్ ప్రైమ్ వారు రెంటల్ డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇక త్వరలో ఇండియ‌న్ స్ట్రీమింగ్‌కు సంబంధించి మేకర్స్ ప్ర‌క‌టించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 

 

కాదల్ ది కోర్ కథేంటి?

బ్యాంకులో ప‌ని చేసి రిటైర్ అయిన జార్జ్‌ దేవసి (మమ్ముట్టి) తన భార్య ఓమన (జ్యోతిక)తో కలిసి నివసిస్తుంటాడు. ఊరిలో జరిగే పంచాయితీ ఎలక్షన్స్లో అతడు నిలబడదామనుకుంటాడు. అతని భార్య (జ్యోతిక) విడాకులకు అప్లై చేయడంతో..కథ చాలా కాంప్లిక్స్ గా జరుగుతుంది. అదే గ్రామంలో డ్రైవింగ్‌ స్కూల్ నడుపుతోన్న ఓ స్నేహితుడితో జార్జ్‌ గత కొన్నేళ్లుగా స్వలింగ సంపర్క బంధం కొనసాగిస్తున్నాడని ఆమె (జ్యోతిక) ఆరోపిస్తుంది. 

జార్జ్‌ లైంగిక ధోరణిని తాను నేరంగా చూడడం లేదని..కేవలం విడాకులు మాత్రమే కోరుతున్నట్లు కోర్టుకు వెల్లడిస్తుంది. దీంతో అతడు పోటీలో నిలబడటంపై సందిగ్ధత నెలకొంటుంది. అయితే, జార్జ్‌ మాత్రం అతనిపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? జార్జ్‌ ఎన్నికల్లో పోటీ చేశాడా? వీరికి కోర్టు నుండి విడాకులు వచ్చాయా? లేదా అనేది మిగతా కథ. కాథల్-ది కోర్‌మూవీని మమ్ముట్టి అండ్ వేఫేరర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి.