
ఇన్ఫ్లుయెన్సర్స్ రెగ్యులర్‌గా వీడియోలు తీస్తుంటారు. సెల్ఫీ వీడియో అయితే పర్వాలేదు. కానీ.. ఆన్లైన్ క్లాస్‌లు, లైవ్ స్ట్రీమ్ లాంటివి తీసేటప్పుడు మరో వ్యక్తి సాయం తీసుకోవాల్సి వస్తుంది. కానీ.. వ్యాంట్రో కంపెనీ తీసుకొచ్చిన ఈ ఫేస్ ట్రాకింగ్ ట్రైపాడ్ ఉంటే ఎవరి సాయం లేకుండానే వీడియోలు తీసుకోవచ్చు. ఇది మనిషి కదలికలను గుర్తించగలదు. అంటే మనిషి ఎటువైపు వెళ్తే.. అటువైపు కెమెరాని తిప్పుతుంది. అందుకోసం ఈ ట్రైపాడ్లో ప్రత్యేకంగా 360 డిగ్రీలు తిరిగే మోటార్, సెన్సర్ ఉంటాయి.
ముఖ్యంగా లైవ్ స్ట్రీమ్స్, వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. దీనికి ఫోన్‌తోపాటు గోప్రో, కాంపాక్ట్ కెమెరాలు పెట్టుకోవచ్చు. దీన్ని గెస్చర్స్‌తో కూడా కంట్రోల్ చేయొచ్చు. అంటే అరచేతిని పైకెత్తి చూపిస్తే వీడియో రికార్డింగ్ ఆగిపోతుంది. మరో గెస్చర్ చూపిస్తే తిరిగి ఆన్ అవుతుంది. దీన్ని వాడడం కూడా చాలా ఈజీ. యూఎస్బీ టైప్సీతో బ్యాటరీ చార్జ్ చేసుకోవచ్చు.
ధర: రూ. 1,999
ఫోన్ రిమోట్
సాధారణంగా రిమోట్‌తో టీవీ లాంటి గాడ్జెట్స్‌ని ఆపరేట్ చేస్తుంటాం. కానీ.. ఈ రిమోట్‌తో ఫోన్‌ని కూడా ఆపరేట్ చేయొచ్చు. ముఖ్యంగా ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నప్పుడు ఇది షట్టర్ బటన్‌లా పనిచేస్తుంది. దీన్ని ట్రిడెయో అనే కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీనికి ఆరు బటన్స్ ఉంటాయి. దీంతో ఈ బుక్స్ చదివేటప్పుడు పేజీలను తిప్పొచ్చు. రీల్స్ వీడియోలను స్క్రోల్ చేయొచ్చు. ఇది కంటెంట్ క్రియేటర్లతోపాటు సింగర్స్, ప్రెజెంటర్లు, ఈ బుక్స్ చదివేవాళ్లకు బాగా ఉపయోగపడుతుంది. బ్లూటూత్ ద్వారా ఫోన్‌కి కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. ఇందులో చిన్న(బటన్) బ్యాటరీ ఉంటుంది. దీన్ని రీప్లేస్ చేసుకోవచ్చు.
ధర: రూ. 599
►ALSO READ | ఈ ఫేస్ట్రాకింగ్ ట్రైపాడ్ఉంటే ఎవరి సాయం లేకుండానే వీడియోలు తీసుకోవచ్చు