ఇటలీ బయల్దేరిన వరుణ్, లావణ్య.. నవంబర్ 1న పెళ్లి!?

ఇటలీ బయల్దేరిన వరుణ్, లావణ్య.. నవంబర్ 1న పెళ్లి!?

టాలీవుడ్‌ స్టార్స్‌ వరుణ్‌ తేజ్‌(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi ) వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి వేడుక నవంబర్‌ 1న ఇటలీలోని టస్కనీలో జరగనుంది. ఈ వేడుకకు మెగా కుటుంబం, అల్లు కుటుంబం, లావణ్య త్రిపాఠి  కుటుంబంతోపాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారని సమాచారం. ఈ మేరకు పెళ్లికి నాలుగు రోజుల ముందే ఇటలీ పయనమయ్యారు ఈ జంట. శుక్రవారం(అక్టోబర్ 27) ఉదయం హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కెమెరాకు చిక్కారు ఈ జంట. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇక పెళ్ళో వివరాల్లోకి వెళితే.. అక్టోబర్‌ 30న మెహందీ, హల్దీ వేడుకలు, నవంబర్ 1న కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి వేడుక జరుగనుంది. వీరి వెడ్డింగ్‌ కార్డ్‌ ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అనంతరం నవంబర్‌ 5న హైదరాబాద్ మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో రిసెప్షన్‌ జరగనుంది.