Vastu Tips : అపార్ట్ మెంట్ లో రెండో బాత్రూం ఎక్కడ ఉండాలి.. డైనింగ్ హాల్ ఎటువైపు ఉండాలి..?

Vastu Tips : అపార్ట్ మెంట్ లో రెండో బాత్రూం ఎక్కడ ఉండాలి.. డైనింగ్ హాల్ ఎటువైపు ఉండాలి..?

ఎప్పుడో పూర్వీకులు కట్టిన ఇట్టిన ఇంటిని.. అపార్ట్​మెంట్​ను చాలామంది ఇప్పుడు లేటెస్ట్​ జనరేషన్​ తగిన విధంగా మాడిఫై చేసుకుంటున్నారు.  గతంలో ఉన్న ఇంటిని రెన్నోవేషన్​ చేసేటప్పుడు రెండో బాత్రూం ఎక్కడ నిర్మించుకోవాలి.. డైనింగ్​ హాల్​ ఏ దిక్కులో ఉండాలి.  వాస్తు కన్సల్టెంట్​ కాశీనాథునిశ్రీనివాస్ ఏమంటున్నారో తెలుసుకుందాం. . . 

ప్రశ్న: ఇంటి మెయిన్​ డోర్​ దక్షిణ దిక్కుకు, ఇంటి డోర్ తూర్పు దిక్కుకు కట్టుకున్నాం. బాత్​ రూం  వాయువ్యంలో వచ్చింది. ఆగ్నేయంలో వంటగది, దక్షిణం వైపు ఉంది. ఇప్పుడు రెండో బాత్రూం ట్టుకోవాలనుకుంటున్నాం. ఎటువైపు కట్టుకుంటే సమస్యలు రాకుండా ఉంటాయి? 

జవాబు: వాస్తు ప్రకారం కిచెన్, బెడ్ రూం. బాత్ రూం.. అన్నీ బాగానే ఉన్నాయి. బెడ్రూం కొంత తగ్గించి, దానికి ఆగ్నేయం వైపు రెండో బాత్ రూం కట్టుకుంటే మంచిది. హాల్ పెద్దదిగా ఉంది అంటున్నారు. దాన్ని కొంత తగ్గించి, ఆగ్నేయం వైపు కట్టుకున్నా వాస్తు ప్రకారం ఇబ్బంది లేదు. మిగిలిన వాటిలో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు. 

Also Read : మన వరంగల్ లోని ఈ గడీలో

ప్రశ్న:  మా ఇంట్లో డైనింగ్​ హాల్​ లేదు. ఆగ్నేయంలో కిచెన్, పూజ గదులున్నాయి. ఉత్తర దిక్కులో మెయిన్ డోర్ ఉంది. తూర్పు, పడమర దిక్కుల్లోబెడ్​ రూమ్​ లు ఉన్నాయి. డైనింగ్ హాల్ ఏ వైపు ఉంటే మంచిది?ఇంటిని రీడిజైన్ చేయించాలనుకుంటున్నాం. ఎలా కట్టుకోవాలి. 
 
జవాబు: మీ ఇంట్లో ఉన్న ఖాళీ స్థలాన్ని బట్టి డైనింగ్ హాల్ ఏర్పాటు చేసుకోవాలి, వాస్తు ప్రకారం తూర్పు ఉత్తరంలో డైనింగ్ హాల్ ఉంటే మంచిది. ఉత్తర ఈశాన్యంలో ఉన్నా ఫర్వాలేదు. మీకున్న వెసులుబాటను బట్టి డైనింగ్ హాల్ ఇంటి మధ్యలో తూర్పుభాగంలో వచ్చేలా చూసుకోండి. ఒకసారి మీకు దగ్గరున్న సిద్ధాంతికి చూపించి, సలహా తీసుకోండి.