Venkatesh: ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే..కూతురు సెంటిమెంట్ సైంధవ్

Venkatesh: ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే..కూతురు సెంటిమెంట్ సైంధవ్

హీరో వెంకటేష్ (Venkatesh) కెరీర్ మైల్ స్టోన్ 75వ మూవీ సైంధవ్ (Saindhav). ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సినిమాలను చూసుకుంటే..యాక్షన్  స్పార్క్..తండ్రి కూతురి ఎమోషన్స్ బలంగా ఉన్న చిత్రంగా..రేపు (జనవరి 13న) థియేటర్లోకి రాబోతుంది.

వెంకీ ఈ సినిమాలో తనదైన నటనతో అన్ని వర్గాల ఆడియాన్స్ను ఆకట్టుకోబోతున్నాడు.ఈ సినిమా ప్రతి ఒక్కర్ని..ముఖ్యంగా ప్రతి తల్లి తండ్రుల్ని ఎమోషన్స్తో కట్టి పడేస్తుందని మేకర్స్ వరుస ప్రమోషన్ల వేదికలపై చెబుతూ వస్తున్నారు. 

ఇక లేటెస్ట్గా వెంకీ సైంధవ్ విశేషాలను,తన వ్యక్తిగత విషయాలను మీడియాకు పంచుకున్నారు. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఒక్క వివాదం కూడా లేకుండా..జీరో హేటర్స్ ను సంపాదించుకున్న నటుడిగా వెంకటేష్ గుర్తింపు పొందాడు.

ఇక ఇదే విషయం గురుంచి వెంకీని..మీడియా ప్రశ్నించింది. దీనికి సమాధానం ఇస్తూ..అది ఎలా అని తెలుసుంటే..ఇప్పటికే అందరికీ చెప్పేవాడిని( నవ్వుతూ). ఇప్పటివరకు నిజంగా నాకు తెలీదు. ఒక్క విషయం చెప్పాలంటే..చిన్నప్పటి నుంచి తోటి వారికి కానీ, ఇంకెవరికైనా సరే అసౌకర్యం కలిగించకూడదనే మనస్తత్వం నాది. స్కూల్, కాలేజీలో కూడా నా మనస్తత్వం ఇలానే ఉండేదని వెల్లడించాడు. అలాగే,సైంధవ్ కథ గురించి చెబుతూ..హృదయానికి హత్తుకునే కూతురిసెంటిమెంట్ ఉంటుందని..రెగ్యులర్ గా కాకుండా కథకు అవసరమైయ్యే ఎమోషనల్ యాక్షన్ సీక్వెన్స్ లు సైంధవ్ లో వున్నాయని..ఎప్పటికీ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ మూవీ అవుతుందని తెలిపారు.

డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, తమిళ నటుడు ఆర్య, రుహానీ శర్మ తదితరులు ప్రముఖ పాత్రల్లో కనిపిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి.. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమా వెంకటేష్ కు ఎలాంటి రిజల్ట్ ను అందించనుందో చూడాలి.