Saindhav Business: సైంధవ్ బాక్సాపీస్ హిట్ కొట్టాలంటే ఎంత రావాలి?

Saindhav Business: సైంధవ్ బాక్సాపీస్ హిట్ కొట్టాలంటే ఎంత రావాలి?

విక్టరీ వెంకటేష్ (Venkatesh)  హీరోగా సంక్రాంతికి రాబోతున్న లేటెస్ట్ మూవీ సైంధవ్ (Saindhav). ఈ మూవీ ప్రధానంగా తండ్రి కూతురి ఎమోషన్తో వస్తుండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అలాగే సైంధవ్లో  వెంకీ మాస్ యాక్షన్ సీన్స్ వావ్ అనేలా ఉన్నాయి. దీంతో యూత్లో కుడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. భారీ అంచనాలతో వస్తోన్న ఈ సినిమా వరల్డ్ వైడ్గా..ఎంత బిజినెస్ చేసింది..బ్రేక్ ఈవెన్ రావాలంటే, ఇంకా ఎంత బిజినెస్ చేయాలో చూద్దాం..

ఈ సినిమాకు నైజాం ఏరియాలో చూసుకుంటే..దాదాపు 7 కోట్ల ధర పలికినట్లుగా తెలుస్తోంది. అలాగే ఆంధ్రలో 9 కోట్ల రేంజ్ లో పలికినట్లు సమాచారం. ఇక ఓవరాల్ గా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్స్ కలిపి చూసుకుంటే ..19 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు నుండి సమాచారం. కర్ణాటకలో 2 కోట్లు ధర పలకగా.. ఓవర్సీస్లో దాదాపు 4 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 25 కోట్ల రేంజ్లో ఇప్పటివరకు బిజినెస్ చేసింది. 

సైంధవ్ బాక్సాఫీస్ వద్ద..లాభాల బాట పట్టాలంటే..తప్పనిసరిగా 26 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్స్ సాధించాల్సి ఉంటుంది. అయితే హిట్ సీరిస్ను తెరకెక్కించిన శైలేష్ కొలను స్క్రీన్ ప్లే, వెంకీ నటన, నవాజుద్దీన్ సిద్ధిఖీ వంటి నటుల పర్ఫామెన్స్ ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో సినిమాపై అదిరిపోయే బజ్ క్రియేట్ అయింది. దీంతో ఇంతటి టార్గెట్ అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదనిపిస్తోంది.

హై-యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంతో బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీని నిహారిక ఎంటర్టైనమెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు.సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా జనవరి 13న రిలీజ్ కాబోతుంది.