Chiranjeevi Voice Note: వాల్తేరు వీరయ్య ఆ థియేటర్లో 365 రోజులు పూర్తి

Chiranjeevi Voice Note: వాల్తేరు వీరయ్య ఆ థియేటర్లో 365 రోజులు పూర్తి

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) హీరోగా బాబీ డైరెక్షన్లో తెరకెక్కిన మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ వాల్తేరు వీరయ్య(Waltair Veerayya). 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13 ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 108 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. ఒక ఓవరాల్ కలెక్షన్స్ చూసుకుంటే..అత్యధిక కలెక్షన్స్‌తో రూ.236 కోట్లు రాబట్టిన చిత్రంగా రికార్డుకెక్కింది. 

లేటెస్ట్గా ఈ మూవీ అరుదైన రికార్డ్ సాధించినట్టు మెగాస్టార్ తన వాయిస్ నోట్(Voice Note) రిలీజ్ చేశారు. 2023 సంక్రాంతి నుంచి 2024 సంక్రాంతి వరకు ఏపీలోని అవనిగడ్డలో ఉన్న రామకృష్ణ థియేటర్‌లో(Ramakrishna) రోజుకు నాలుగు ఆటలతో 365 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటికి వాల్తేరు వీరయ్య విజయవంతంగా ఆడుతుందంటే..మీ అభిమానానికి..మీ ప్రేమకి నా అభినందనలు.

దీనికి కారణం మీ మనసుకి నచ్చేలా సినిమాను మలిచిన డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్, నా తమ్ముడు రవితేజతో పాటు సినిమా నిర్మించిన మైత్రి మేకర్స్..ఇలా అందరి సమిష్టి కృషి వాల్తేరు వీరయ్య..అంటూ చిరు తన వాయిస్ నోట్ లో తెలిపారు.ప్రస్తుతం ఈ వాయిస్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఈ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి వింటేజ్‌ లుక్‌ చూసి ఫ్యాన్స్ సంబరపడిపోయారు. చిరు డ్యాన్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌కు తోడు..కామెడీ జత కావడంతో వాల్తేరు వీరయ్య సూపర్ హిట్‭గా నిలిచింది. ఇందులో మెగాస్టార్ కు జోడీగా శృతి హాసన్ నటించింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు.