సైంధవ్కు ఎలా సాధ్యం : నోట్లో బుల్లెట్.. కింద నుంచి అలా ఎలా?

సైంధవ్కు ఎలా సాధ్యం : నోట్లో బుల్లెట్.. కింద నుంచి అలా ఎలా?

సినిమా మేకర్స్..ఒక విషయాన్ని స్క్రీన్పై తీసుకురావడానికి చాలా వర్క్ చేస్తారు. ప్రసెంట్ టెక్నాలజీకి సంబందించిన ప్రతి విషయంపై అవగాహనతో పనిచేస్తారు. కొన్నిసార్లు మేకర్స్ చేసే అద్భుతాలకు వావ్.. సూపర్బ్ అంటాం. ఇంకొన్ని సార్లు షాక్ కి గురి అవుతాం. సైంధవ్ సినిమా విషయంలో సరిగ్గా షాకే తగిలింది. కరెంట్ తీగే కాదు..ఏకంగా కరెంట్ పోలే వచ్చి మీదపడింది. 

అసలు వివరాల్లోకి వెళితే..నిన్న (జనవరి 3న) సైంధవ్ (Saindhav) మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. తండ్రి కూతుళ్ల ఎమోషన్స్తో పాటుగా..యాక్షన్ సీన్స్తో అదరగొట్టేశాడు వెంకీ. ఎమోషన్స్ పరంగా ట్రైలర్ అందరినీ హత్తుకుంది. అలాగే యాక్షన్ సీన్స్ తో కూడా గూస్బంప్స్ తెప్పించింది.కానీ, నెటిజన్లు.. ఒక్క సీన్ ను మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్ చేస్తున్నారు. 

అసలు ఇది ఎలా సాధ్యమైంది వెంకీ మామా..మరి ఇంతలనా! అంటూ కామెంట్లు పెడుతున్నారు. విలన్ గ్యాంగ్తో ఫైట్ చేసే టైంలో..ఒక రౌడీ నోట్లో గన్ పెట్టి షూట్ చేస్తారు వెంకీ. వెంటనే ఆ బుల్లెట్ నోట్లో నుంచి..ఏకంగా వెనుక వైపు నుంచి బయటకు వస్తుంది. దీంతో.. నెటిజన్స్ ఊరుకుంటారా..ట్రైలర్లో ఈ చిన్న సీన్ను కట్ చేసి తెగ షేర్ చేస్తున్నారు.

అంతేకాదండోయ్..ఇంకొదరైతే..ఆ బుల్లెట్ నోటి నుంచి వెనుక వైపు నుంచి ఎలా బయటకొచ్చిందన్న విషయమై..బ్రహ్మీ వాయిస్తో వీడియో క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. నోటి నుంచి బాడీలోకి వెళ్లి బుల్లెట్ ఎలా బయటకొచ్చిందనేది వీడియో ద్వారా సరదాగా వివరించే ప్రయత్నం చేశారు నెటిజన్స్. ఈ వీడియో వైరల్ అవుతూనే..తెగ ఆకట్టుకుంటోంది.

ట్రైల‌ర్ చూస్తే..వెంకీ కూతురు నరాలకు సంబంధించిన ‘స్పైనల్ మాస్క్యూలర్ ఎట్రోఫి’ అనే అరుదైన‌ వ్యాధితో బాధపడుతుంటుంది. అయితే ఈ వ్యాధి నుంచి పాప పూర్తిగా కోలుకోవాలంటే రూ.17 కోట్ల విలువైన ఓ ఇంజెక్షన్ ఇవ్వాలి. ఈ నేపథ్యంలో వెంకీ త‌న పాప‌ను ర‌క్షించుకోవ‌డానికి రూ.17 కోట్లు ఎలా తీసుకోచ్చాడో..అదే ఇంజక్షన్ విలన్ కి కూడా అవసరం ఉంటుంది. ఇక వీరి మధ్య జరిగే పోరాటమే సైంధవ్. 

ALSO READ | హనుమాన్ సూపర్ హిట్ అవ్వాలి.. తేజకు ఆధ్మాత్మిక ఉంగరం గిఫ్టుగా ఇచ్చిన నిర్మాత

ఈ పాన్ ఇండియా మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి భారీ స్థాయిలో నిర్మిస్తుండ‌గా, సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా జనవరి 13న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్  కానుంది.