Mega157: అనిల్ ప్లాన్ అదుర్స్.. చిరు 157లో వెంకీ మామ.. ప్రేక్షకులకు నవ్వుల జాతరే!

Mega157: అనిల్ ప్లాన్ అదుర్స్.. చిరు 157లో వెంకీ మామ.. ప్రేక్షకులకు నవ్వుల జాతరే!

చిరు-అనిల్ రావిపూడి మూవీలో వెంకీ మామ నటిస్తున్నట్లు సమాచారం. గతకొన్ని రోజుల నుంచి చిరు157లో వెంకీ కీలకపాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడీ ఈ వార్తల్లో వందశాతం నిజముందనేది సినీ వర్గాల టాక్.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. మెగా 157 కోసం.. హీరో వెంకటేష్ 30 రోజుల డేట్స్ ఇచ్చినట్లు టాక్. అందులో కొన్నిరోజులు మూవీ ప్రమోషన్స్ కూడా కేటాయించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే, డైరెక్టర్ అనిల్ అండ్ టీమ్.. చిరు,వెంకీల ఎపిసోడ్ కోసం స్పెషల్ సెట్‌ను రూపొందించారట. వీరిద్దరి కాంబోలో వచ్చే సీన్స్‌కి.. థియేటర్స్లో ఫన్ బ్లాస్ట్ అయ్యేలా కథనం డిజైన్ చేశాడట అనిల్. త్వరలో వెంకీమామ ఎంట్రీపై మేకర్స్ నుంచి ఓ వీడియో రిలీజ్ కానుందని కూడా టాక్ ఉంది.

ఇదే కనుక నిజమైతే.. మెగా&విక్టరీ ఫ్యాన్స్లో నవ్వుల సంబురాలే. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో వెంకటేష్ లో మంచి హాస్యం పండించాడు అనిల్. ఇప్పుడు చిరంజీవితో కూడా మాస్‌, మసాలా ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేశాడు. ఇక వీరిద్దరినీ కలిపి.. స్క్రీన్ పై నటింపజేస్తే ఎలా ఉంటుందో.. ఊహించేసుకోండి. అది నవ్వుల జాతరే.

ప్రస్తుతం మెగా157 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే, సెకండ్ షెడ్యూల్‌‌ పూర్తయినట్టు మేకర్స్ తెలియజేశారు. ముస్సోరీలో జరిగిన ఈ షెడ్యూల్‌‌లో చిరంజీవి, నయనతార మీద కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

ఈ మూవీని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. 2026 సంక్రాంతికి మూవీ రిలీజ్ కానుంది.