Saindhav Movie: స్పెషల్ చైర్ నాకు అక్కర్లేదు..వెంకీ సింప్లిసిటీకి మీడియా ఫిదా

Saindhav Movie: స్పెషల్ చైర్ నాకు అక్కర్లేదు..వెంకీ సింప్లిసిటీకి మీడియా ఫిదా

విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా సంక్రాంతికి రాబోతున్న లేటెస్ట్ మూవీ సైంధవ్( Saindhav). ఈ మూవీ ప్రధానంగా కూతురి ఎమోషన్ తో వస్తుండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.అలాగే వెంకీ మాస్ యాక్షన్ సీన్స్ వావ్ అనేలా ఉన్నాయి.దీంతో యూత్ లో కుడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

ఇదిలా ఉంచితే..ఈ సినిమా రేపు (జనవరి 13న) థియేటర్లోకి రాబుతుంది. దీంతో వెంకీ వరుస ప్రమోషన్స్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. లేటెస్ట్ గా వెంకీ హుందాతనం..సింప్లిసిటీ..తాను ఎదుటివాళ్ళకు ఇచ్చే గౌరవం మరోసారి మీడియా కంట పడింది.  

వివరాల్లోకి వెళితే..సైంధవ్ ప్రమోషన్స్ లో భాగంగా వెంకటేష్ మీడియా మీట్ కి వెళ్ళినప్పుడు..అక్కడ వెంకీ కూర్చోవడానికి స్పెషల్ చైర్ని ఆరెంజ్ చేశారు. మీడియా వాళ్ళు కూర్చొన్న నార్మల్ చైర్స్ లోనే నాకొక చైర్ వేయండి..స్పెషల్ చైర్ నాకు అక్కర్లేదు..అంటూ తన టీమ్ మెంబర్స్ కి చెప్పాడు. దీంతో మీడియా వాళ్ళు వెంకీ మామ చూపించే సింప్లిసిటీ కి ఫిదా అవుతున్నారు.

సినిమా ఇండస్ట్రీలో కాస్తా ఫేమ్ వస్తేనే..గాల్లో మేడలు కట్టేస్తుంటారు..ఇంకా చెప్పాలంటే ఇప్పటివరకు ఏ ఇతర హీరోలు కూడా ఇలా చేసింది లేదు. ఇది చాలా చిన్నవిషయమే అయిన.. సాధారణ వ్యక్తిత్వంతో ఉండటం పట్ల మీడియా వాళ్ళు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం వెంకీ చైర్ వద్దోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇక ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్, రుహాణి శర్మ, ఆండ్రియా, తమిళ హీరో ఆర్య, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. మరి చాలా కాలం తరువాత యాక్షన్ మూవీ చేస్తున్న వెకంటేష్ కు సైంధవ్‌  ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందో చూడాలి.