Maargan: విజయ్ ఆంటోనీ క్రైమ్ థ్రిల్లర్కు భారీ హైప్.. విడుదలకు ముందే యూట్యూబ్లో 6 నిమిషాల సినిమా..

Maargan: విజయ్ ఆంటోనీ క్రైమ్ థ్రిల్లర్కు భారీ హైప్.. విడుదలకు ముందే యూట్యూబ్లో 6 నిమిషాల సినిమా..

విజయ్ ఆంటోని హీరోగా నటిస్తూ, నిర్మించిన మూవీ ‘మార్గన్’. లియో జాన్ పాల్ దర్శకుడు. రేపు శుక్రవారం (జూన్ 27న) సినిమా విడుదల కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ సురేష్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్ ద్వారా సురేష్ బాబు రిలీజ్ చేస్తున్నారు.

మార్గన్ మూవీపై భారీ భారీ అంచనాలున్నాయి. అందుకు కారణం ఇదొక సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ విజువల్స్ అది ప్రూవ్ చేసింది. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్‌‌ ఎక్స్‌‌పీరియన్స్‌‌ను ఇచ్చేలా ఉండటంతో సినిమా కోసం తెలుగు, తమిళ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఈ క్రమంలోనే ఆడియన్స్ అంచనాలను మరింత రెట్టింపు చేశాడు హీరో విజయ్ ఆంటోని. సినిమా రిలీజ్కు ముందే యూట్యూబ్లో 6 నిమిషాల మూవీ రిలీజ్ చేశాడు. ఇపుడీ తొలి ఆరు నిమిషాల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటోంది. తన సినిమాపై ఎంత నమ్మకం ఉంటే.. ఇలా రిలీజ్కు ముందే 6 నిమిషాల సీన్ చూపిస్తాడు చెప్పండి.!

మిస్టరీ, సస్పెన్స్ క్రియేట్ చేస్తూ సాగే కథనం, దానికి మరింత ఎలివేషన్ ఇస్తూ ఆకట్టుకునే BGM సినిమావైపు మరల్చాయి. ఈ క్రమంలో సినిమా కోసం వెయిటింగ్ అంటూ.. ఆడియన్స్ కామెంట్స్ పెడుతూ.. వీడియో షేర్ చేస్తున్నారు. సో, మీరు కూడా చూసి.. నచ్చితే.. మార్గన్ వైపు అడుగేయండి!

ఇకపోతే.. ఈ మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌లో విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధీషన్‌‌‌‌ విలన్‌‌‌‌గా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీలో సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.