మళ్ళీ థియేటర్స్లో లియో.. నవంబర్ 3 నుండి సరికొత్తగా.. మేకర్స్ షాకింగ్ డెసిషన్

మళ్ళీ థియేటర్స్లో లియో.. నవంబర్ 3 నుండి సరికొత్తగా.. మేకర్స్ షాకింగ్ డెసిషన్

తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజు(Lokesh kanagaraj), దళపతి విజయ్(Talapathy Vijay) కాంబోలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ లియో(Leo). దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమా ఇప్పటివరకు రూ.540 కోట్ల భారీ వసూళ్లను రాబట్టి విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక తాజాగా ఈ కలెక్షన్స్ మరింత పెరిగే డెసిషన్ తీసుకున్నారు మేకర్స్. 

అదేంటంటే.. లియో సినిమా మరోసారి సరికొత్తగా థియేటర్లలోకి రానుంది. ఆడియన్స్ డిమాండ్ మేరకు షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు లియో మేకర్స్. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..  రిలీజ్ సమయంలో లియో సినిమాకి సెన్సార్ 15 కట్స్  వేసింది. దీంతో.. సెన్సార్ కట్స్ లేకుండా రిలీజ్ చేస్తే బాగుండేది అంటూ విజయ్ ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ కోరిక మేరకు సరికొత్తగా లియో సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. 

నవంబర్ 3 నుంచి లియో సినిమా సెన్సార్ కట్స్ లేకుండా ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు. దానికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. కానీ.. ఈ సినిమాను 18 ఏళ్లు దాటిని మారు మాత్రమే చూడటానికి వీలుంటుంది. ఈ కొత్త నిర్ణయంతో లియో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. మరి సెన్సార్ కట్స్ లేకుండా వస్తున్న లియో కొత్త వర్షన్ పై ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Also Read :- అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కించుకున్న రామ్ చరణ్