బాక్సాఫీస్ వద్ద 'రణబాలి' దండయాత్రకు సమయం ఆసన్నమైంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మోస్ట్ వెయిటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. 'గీత గోవిందం' వంటి బ్లాక్బస్టర్ తర్వాత ఈ క్యూట్ అండ్ పవర్ఫుల్ పెయిర్ మళ్లీ బిగ్ స్క్రీన్పై సందడి చేయనుండటంతో అభిమానుల ఉత్సాహం అంబరాన్ని తాకుతోంది.
ఈ మోస్ట్ అంటెసిపేటెడ్ ఫిలిం రిలీజ్ నేపథ్యంలో నేచురల్ స్టార్ నాని చిత్రబృందానికి స్పెషల్ శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తోంది. విజయ్ తన కూల్ ఇమేజ్ నుంచి రణబాలిగా చూపించిన ఉగ్రరూపం, మాస్ ట్రాన్స్ఫార్మేషన్ ఎంతో స్ఫూర్తిదాయకం ఉందన్నారు. రాహుల్ సాంకృత్యాన్ విజన్, 'జయమ్మ'గా రష్మిక మేకోవర్ మైండ్ బ్లోయింగ్ అంటూ నాని చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు.
Tomorrow we have release of #Ranabaali . Everything about the film shows how much effort the team has put in to make this important film. The way Vijay @TheDeverakonda has transformed himself so effortlessly from the super cool guy we know to this ferocious man called Ranabaali is inspiring. @iamRashmika as Jayamma is as adorable and authentic as it gets. @Rahul_Sankrityn is so good with such stories which need research and detailing and it shows that he has put his heart in to this one. My love and best wishes to the whole team. @MythriOfficial
— Nani (@NameisNani) October 15, 2026
మరోవైపు ఓవర్సీస్లో 'రణబాలి' అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డుల రచ్చ లేపుతున్నాయి. యుఎస్ఏ ప్రీ-సేల్స్ ఇప్పటికే 2 లక్షల 75 డాలర్లు దాటేసింది. ప్రీమియర్స్ సమయానికి 5లక్షల డాలర్ల మార్కును చేరుకునేలా దూసుకెళ్తోంది. రాయలసీమ బ్రిటీష్ కాలం నాటి తీవ్ర కరువు నేపథ్యంతో మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రానికి అజయ్-అతుల్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో ఊచకోత కోయడం ఖాయంగా కనిపిస్తోంది.
►ALSO READ | Rayavalasa: 'రింగుడు రింగుడు' పాటతో క్రేజ్.. 'రాయవలస'తో కార్తీక్ జయంతి ఎంట్రీ
ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో నాని ప్రశంసలు మరింత హైప్ తీసుకెళ్తోంది. మరి విజయ్ దేవరకొండ, రష్మిక కెరీర్లోనే బిగ్గెస్ట్ మైలురాయిగా నిలిచేలా ఈ 'రణబాలి' బాక్సాఫీస్పై ఎలాంటి రికార్డుల తుఫాను సృష్టిస్తుందో చూడాలి.
