KannappaMovie: కన్నప్పలో హైలెట్ సీన్స్ ఇవే.. కీలకమైన ఆ 40 నిమిషాల్లో ఏముంది?

KannappaMovie: కన్నప్పలో హైలెట్ సీన్స్ ఇవే.. కీలకమైన ఆ 40 నిమిషాల్లో ఏముంది?

మంచు విష్ణు కెరీర్‌లోనే ప్ర‌తిష్టాత్మ‌క సినిమాగా తెర‌కెక్కిన క‌న్న‌ప్ప శుక్ర‌వారం (జూన్ 27న) థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి గొప్ప స్పందన వస్తోంది. ప‌ర‌మ నాస్తికుడైన ఓవేట‌గాడు.. శివ భ‌క్తుడిగా ఎలా మారాడు? త‌న రెండు క‌ళ్ల‌ను ఎలా త్యాగం చేశాడు? అన్న‌దే క‌న్న‌ప్ప క‌థ‌. 

ఇందులో విష్ణు తిన్నడు పాత్ర పోషించాడు. తల్లీతండ్రి తప్ప మరో దైవం లేరని చెప్పేవాడు తిన్నడు. ఆ తిన్నడు కన్నప్పగా ఎలా మారాడో తెలియజెప్పే సీన్స్కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. కన్నప్ప భక్తి తీవ్రతకు, ముఖ్యంగా భావోద్వేగభరితమైన క్లైమాక్స్‌కు కంటతడి పెడుతున్నారు. ప్రేక్షక విమర్శకుల నుంచి సైతం విష్ణు అత్యుత్తమ నటనపై ప్రశంసలు వస్తున్నాయి.  

అయితే, ఈ సినిమాను నిలబెట్టడానికి ముఖ్యమైన చివరి 40 నిమిషాల గురించి మరింత చర్చ నడుస్తోంది. నాస్తికుడైన తిన్నడు.. భక్త కన్నప్పగా మారేందుకు దారి తీసిన ప‌రిణామాలు ఆ 40 నిముషాలు సినిమాకు హైలెట్గా నిలిచాయి. అలాగే ప్రభాస్ డైలాగ్స్ విషయంలో డైలాగ్ రైటర్ మంచి ప్రతిభ కనబరిచాడు. ఇందులో భాగంగా ప్రభాస్ చెప్పిన పెళ్లి డైలాగ్కు థియేటర్స్ హోరెత్తాయి. ప్రభాస్, విష్ణు ,మోహన్ బాబు కాంబినేష‌న్‌లో వ‌చ్చే సీన్స్‌ మరియు డైలాగ్స్ వీపరీతంగా ఆక‌ట్టుకుంటున్నాయి.

►ALSO READ | Kannappa: ‘కన్నప్ప’ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్.. మంచు విష్ణు ఎమోషనల్ పోస్ట్

ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్లో విష్ణు తన అద్భుతమైన నటనతో ఏడ్పించేశాడు. ఇక చివర్లో శివయ్యకు తిన్నడు తన కన్ను దానం చేసే సీన్.. సినిమాకే హైలెట్గా నిలిచింది. న‌ట‌న ప‌రంగా విష్ణు కెరీర్‌లో బెస్ట్ మూవీస్‌లో ఒక‌టిగా క‌న్న‌ప్ప నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా కోసం మోహన్ బాబు, విష్ణు పెట్టిన ప్రతీ పైసా తెరపై అద్భుతంగా కనిపిస్తుంది. స్వీఫెన్ దేవ‌స్సీ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌, సాంగ్స్ భ‌క్తి భావాన్ని ఎలివేట్ చేసేలా ఉన్నాయి. ఇప్పటికే, ప్రతిపాట జనాల్లోకి వెళ్లి మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి.

ఇక ఇన్నాళ్లు విష్ణుని ట్రోల్స్ చేసిన సోషల్ మీడియా బృందం.. ఇప్పుడు విష్ణు నటనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇది కదా అసలైన సక్సెస్ అంటూ మంచు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.