Kannappa: ‘కన్నప్ప’ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్.. మంచు విష్ణు ఎమోషనల్ పోస్ట్

Kannappa: ‘కన్నప్ప’ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్.. మంచు విష్ణు ఎమోషనల్ పోస్ట్

మంచు విష్ణు చాలా కాలం తర్వాత కన్నప్పతో విజయాన్ని అందుకున్నాడు. ఇవాళ శుక్రవారం (జూన్ 27న) కన్నప్ప మూవీ థియేటర్స్లో రిలీజై పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఇండియాతో పాటు ఓవర్సీస్ (అన్నీ దేశాల్లో) మూవీకి మంచి రివ్యూలు వస్తున్నాయి. ఈ సందర్భంగా హీరో విష్ణు ఎమోషనల్ ట్వీట్ చేశారు. 

‘‘ఈ క్షణం కోసం నా జీవితమంతా ఎదురుచూశాను. ఓవర్సీస్‌ ప్రీమియర్స్‌లో, ఇండియాలో ఫస్ట్ షోకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఆడియన్స్‌ ఈ సినిమాపై చూపుతోన్న అఖండమైన ప్రేమను చూస్తోంటే.. నా హృదయం కృతజ్ఞతా భావంతో నిండిపోయింది. ‘కన్నప్ప’ ఇక నా సినిమా మాత్రమే కాదు.. ఈ క్షణం నుంచి ఇది మీ సినిమా’’ అని తన పోస్ట్‌లో విష్ణు రాసుకొచ్చారు.

విష్ణు.. దశాబ్ద కాలంగా కన్నప్ప మూవీ కోసం పనిచేస్తున్నారు. చాలా సందర్భాల్లో సినిమాకు సంబంధించి పోస్టులు సైతం పెట్టేవాడు. ఈ సినిమాకు హీరోగా మాత్రమే కాకుండా కథ స్క్రీన్ ప్లే అందించి.. నేడు అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. ఈ మూవీలో విష్ణు డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ పెర్ఫార్మన్స్.. ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తున్నాయి. మరి ముఖ్యంగా చివరి 30 నిమిషాల్లో  విష్ణు తన అసాధారణ నటన కనబరిచాడు. 

ఇకపోతే.. కన్నప్ప మూవీలో విష్ణు తిన్నడు పాత్ర పోషించాడు. తల్లీతండ్రి తప్ప మరో దైవం లేరని చెప్పేవాడు తిన్నడు. ఆ తిన్నడు కన్నప్పగా ఎలా మారాడన్నదే ఈ మూవీ కథ. శివుడికి గొప్ప భక్తుడైన కన్నప్ప ఫాంటసీ థ్రిల్లర్‌ను సినీ ఫ్యాన్స్ ఆదరిస్తున్నారు. ప్రభాస్, విష్ణు, మోహన్ లాల్ల నటన సినిమాకు హ్యలెట్గా నిలిచాయని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

ముకేశ్‌ కుమార్‌సింగ్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో శివుడికి గొప్ప భక్తుడైన కన్నప్ప టైటిల్ పాత్ర విష్ణు పోషించగా.. రుద్రగా ప్రభాస్‌, కిరాతగా మోహన్‌లాల్‌, శివుడిగా అక్షయ్‌కుమార్‌, పార్వతిగా కాజల్‌ అగర్వాల్‌ నటించారు.