Gaami Shivam Lyrical: స్పిరిట్ ఆఫ్ గామి..శంకర్ మహదేవన్ గాత్రంతో శివమ్ గూస్ బంప్స్

Gaami Shivam  Lyrical:  స్పిరిట్ ఆఫ్ గామి..శంకర్ మహదేవన్ గాత్రంతో శివమ్ గూస్ బంప్స్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌ (Vishwak Sen) హీరోగా..డైరెక్టర్ విద్యాధర్‌ (Vidyadhar) కాగిత తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ గామి(Gaami). వి సెల్యులాయిడ్‌ పతాకంపై కార్తీక్‌ శబరీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో అఘోరా పాత్రలో సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు విశ్వక్ సేన్‌.

లేటెస్ట్ గా ఈ మూవీ నుండి శివమ్..స్పిరిట్ ఆఫ్ గామి పేరుతో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ ను శివ క్షేత్రం అయిన శ్రీశైలంలోగ్రాండ్ గా లాంచ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ నరేష్ కుమారన్ ఈ సాంగ్ ని కంపోజ్ చేయగా..దిగ్గజ గాయకుడు శంకర్ మహదేవన్ పాటని పాడారు. శ్రీమణి లిరిక్స్ ని అందించారు.

ఇంటెన్స్‌గా ఉన్న మ్యూజిక్, శంకర్ మహదేవన్ గాత్రం, బరువైన సాహిత్యంతో శివమ్ సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కునే పరిస్థితిలో హీరో చేసే ప్రయత్నాలు ఏంటనేవి శివమ్ సాంగ్ లో చూపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. 

గామి మూవీలో శివమ్ పాట లాంచ్‍కు ముందు..నేడు శ్రీశైలం ఆలయాన్ని హీరో విశ్వక్ సేన్ దర్శించుకున్నారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. పంచె కట్టులో నుదుటన నామంతో స్వామి దర్శనం చేసుకున్నారు. ఈ మూవీ మార్చి 8న రిలీజ్ అవుతుండటంతో..ప్రమోషన్స్ లో వేగం పెంచారు మేకర్స్. 

  • Beta
Beta feature