Ramgpoal Varma: వ్యూహం,శపథం సినిమాలు మళ్ళీ వాయిదా.. ఈసారి రీచ్ కోసమే అంటున్న వర్మ

Ramgpoal Varma: వ్యూహం,శపథం సినిమాలు మళ్ళీ వాయిదా.. ఈసారి రీచ్ కోసమే అంటున్న వర్మ

వ్యూహం(Vyooham),శపథం(Shapatham) సినిమాల వాయిదాల పర్వం ఆగడంలేదు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి పడింది. ఈ విషయాన్నీ స్వయంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ramgopal Varma)నే ప్రకటించారు. దీంతో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు మరోసారి నిరాశే ఎదురయింది. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమాలు వ్యూహం, శపధం. ఈ రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమాలు ఏపీ సీఎం జగన్ కు ఫేవర్ గా, ప్రతుపక్ష నేత చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉండనున్నాయని ట్రైలర్ చూస్తే క్లియర్ గా అర్థమవుతోంది. దీంతో కావాలని తమపై తప్పుగా ఈ సినిమాలు తీశారని టీడీపీ నేత నారా లోకేష్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో డిసెంబర్ లో రావాల్సిన ఈ సినిమా ఫిబ్రవరి కి వాయిదా పడింది. 

ఇటీవలే అడ్డంకులు తొలగిపోయాయని ఫిబ్రవరి 23 వ్యూహం, మార్చ్ 1న శపథం సినిమాలు రిలీజ్ అవుతాయని ప్రకటించాడు వర్మ. ఇదే విషయంపై ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. అయితే సఎట్టకేలకు సినిమా విడుదల అవుతోంది అనుకున్న ఫ్యాన్స్ కు మరోసారి నిరాశే ఎదురయ్యింది. ఈ సినిమాను మరోసారి వాయిదా వేస్తూ అప్డేట్ ఇచ్చాడు వర్మ. ఈసారి సినిమా వాయిదాకు లోకేష్ కారణం కాదని, కేవలం కొన్ని టెక్నీకల్ అంశాల వల్ల స్వల్ప ఆలస్యం అవుతుందని, దాని వల్ల జనాలకు ఎక్కువగా రీచ్ అయ్యా అవకాశం ఉందని చెప్తూ..  కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మార్చ్ 1న వ్యూహం, మార్చ్ 8న శపథం సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.