వ్యూహం, శపథం సినిమాలు విడుదల వాయిదా

వ్యూహం, శపథం సినిమాలు విడుదల వాయిదా

వ్యూహం, శపథం సినిమాలు వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ ప్రకటించారు.   కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు వర్మ.  మార్చి 1న వ్యూహం.. మార్చి 8న శపథం విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.  ఈ సారి కారణం లోకేష్ కాదంటూ సెటైర్ వేశారు.  ఫిబ్రవరి 23న అంటే రేపు ఏకంగా తొమ్మిది సినిమాలు రిలీజ్ అవుతుండటంతో  అనుకున్నన్ని థియేటర్‌లు దొరకడం కష్టం కావడంతో వాయిదా వేసినట్లు వర్మ చెప్పుకొచ్చారు.