Vastu tips: ఇంటికి మెయిన్ గేట్ ఎటు ఉండాలి

Vastu tips: ఇంటికి మెయిన్ గేట్ ఎటు ఉండాలి

చాలామంది జనాలు ఇంటికి ఉండే మెయిన్​ గేట్​ విషయంలో చాలా తప్పులు చేస్తుంటారు.. ఏ దిక్కున పెట్టాలో అర్దంకాక.. చాలా తప్పులు చేస్తుంటారు.. ఇలా చేయడం వలన ఇంట్లో మహిళలకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ విషయంలో వాస్తు కన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్​ గారి సలహాలు.. సూచనలు ఒకసారి పరిశీలిద్దాం.  .

ప్రశ్న: మా ఇంటికి తూర్పు, ఉత్తరం వైపు ఖాళీస్థలం ఉంది. ఈస్ట్ ఫేస్ ఇల్లు. స్థలానికి ప్రహరీ లేదు. దక్షిణం వైపున్న రోడ్డులోంచి లోపలికి వచ్చి, తూర్పు వాకిలి గుండా ఇంట్లోకి వెళ్తాం. ఇంటి ముందు గోడ ఉంది. మా స్థలంలోకి వెళ్లడానికి గేట్ ఎటువైపు పెట్టుకోవాలి?

జవాబు:మీ ఇంటికి తూర్పువాకిలి కాబట్టి, గేటు తూర్పులో ఉంటే మంచిది. కుదరకపోతే దక్షిణం వైపు కాంపౌండ్ వాల్ కట్టుకోండి. దక్షిణ ఆగ్నేయంలో లేదా దక్షిణం మధ్యలో మీ వీలు చూసుకుని గేటు పెట్టుకోండి. అలా నడవటం వల్ల చాలా వరకు దోషాలు ఉండవని వాస్తు కన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్ చెబుతున్నారు.

►ALSO READ | Vastu Tips: రెండు వాకిళ్లు ఉంటే ఎటు నుంచి నడవాలి.. ఉత్తర ఈశాన్యంలో వీధిపోటు లాభమేనా..?