Vijay Wife Divorce: విడాకులకు అప్లై చేసిన తలపతి విజయ్ భార్య బ్యాగ్రౌండ్ ఇదే !

Vijay Wife Divorce: విడాకులకు అప్లై చేసిన తలపతి విజయ్ భార్య బ్యాగ్రౌండ్ ఇదే !

చెన్నై: తమిళ సినీ నటుడు, TVK పార్టీ అధినేత తలపతి విజయ్ నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ అతని భార్య సంగీత కోర్టును ఆశ్రయించింది. విజయ్ నుంచి విడాకులు కోరుతూ అతని భార్య సంగీత చెంగల్ పట్టు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో విజయ్ భార్య సంగీత కుటుంబ నేపథ్యం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. సంగీత సోర్నలింగం శ్రీలంక తమిళురాలు. సంగీత, విజయ్ 1999 ఆగస్టు 25న పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఇద్దరు పిల్లలు.. కొడుకు పేరు జాసన్. కూతురి పేరు దివ్య.

సంగీత తండ్రి UKలో స్థిరపడిన ఒక తమిళ పారిశ్రామికవేత్త. ఆమె తండ్రి శ్రీలంకకు చెందిన వ్యక్తి. సంగీతకు దాదాపు రూ.400 కోట్ల రూపాయల నికర ఆస్తి ఉంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సంగీత ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ హిందూ కుటుంబం. దళపతి విజయ్ క్రిస్టియన్. మతాలు వేరైనప్పటికీ మనసులు కలవడంతో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. విజయ్, సంగీత వివాహం హిందూ ఆచారాల ప్రకారం జరిగింది. క్రైస్తవ పద్ధతిలోనూ వివాహం జరిగింది.

1996లో విజయ్ హీరోగా నటించిన పూవే ఉనక్కాగా సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. అప్పటికే సంగీత విజయ్కు వీరాభిమాని. విదేశాల్లో కూడా ఈ సినిమా అప్పట్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.  ఆ సినిమా చూసిన సంగీత.. విజయ్‌ను కలవడానికి చెన్నై వచ్చింది. వ్యాపారవేత్త కూతురు కావడంతో విజయ్ను కలవడానికి సంగీత పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు.

ALSO READ : నా మొగుడు విజయ్.. నాలుగేళ్లుగా ఆ నటితో ఉంటున్నాడు : విజయ్ భార్య సంగీత పిటీషన్

సెట్‌లో విజయ్, సంగీత కొన్ని గంటల పాటు మాట్లాడుకున్నారు. ఇద్దరికీ అలా పరిచయమైంది. కొన్నాళ్లకు ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. విజయ్ ఒకరోజు సంగీతను తన ఇంటికి డిన్నర్కి పిలిచాడు. అప్పుడే విజయ్ తల్లిదండ్రులను సంగీత కలిసింది. విజయ్ తల్లిదండ్రులకు కూడా సంగీత నచ్చింది. మూడు సంవత్సరాలు డేటింగ్ చేశాక.. 1999లో విజయ్, సంగీత పెళ్లి చేసుకున్నారు.