చెన్నై్: తమిళ సినీ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ నుంచి విడాకులు ఇప్పించాలని అతడి భార్య సంగీత కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు చెంగల్ పట్టు ఫ్యామిలీ కోర్టులో సంగీత పిటిషన్ దాఖలు చేశారు. డివోర్స్ పిటిషన్లో భర్త విజయ్‌పై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త విజయ్ 2021 నుంచి ఒక నటితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆరోపించారు.
అక్రమ సంబంధాన్ని ఆపేయాలని పలుమార్లు కోరిన పట్టించుకోకుండా అలాగే సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని పేర్కొంది. భర్తపై తనకు నమ్మకం లేదని.. అతడితో తనకు విడాకులు ఇప్పించాలని పిటిషన్లో కోరింది. భర్త విజయ్‌పై సంగీత చేసిన ఆరోపణలు తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనంగా రేపుతున్నాయి.
నాలుగేళ్లుగా ఇంట్లో సరిగా ఉండటం లేదని.. తనకు దూరంగా ఉంటున్నాడంటూ పిటీషన్ లో స్పష్టం చేసింది విజయ్ భార్య సంగీత. పెళ్లయ్యి 25 ఏళ్లు అవుతుంది.. నాలుగేళ్లుగా విజయ్ ప్రవర్తనలో తేడా వచ్చిందని.. విజయ్ తీరు మారిందని.. కుటుంబానికి దూరంగా ఉంటున్నాడని.. భార్యగా తనకు గౌరవం ఇవ్వటం లేదంటూ పిటీషన్ లో ఆసక్తికర అంశాలను ప్రస్తావించారామె.
2021 నుంచి చెన్నై సిటీలోనే ఉండే ఓ నటితో.. నా భర్త విజయ్ కు వివాహేతర సంబంధం ఉందని.. వాళ్లిద్దరి మధ్య వివాహేతర సంబంధం విషయం నాకు తెలుసు అని.. ఇలాంటి వ్యక్తితో కలిసి ఉండాలని అనుకోవటం లేదంటూ.. తన విడాకుల పిటీషన్ లో కారణాలను స్పష్టం చేశారు సంగీత. ఇంత జరిగిన తర్వాత కూడా కలిసి ఉండటం అనేది సాధ్యం కాదని.. విజయ్ తో కలిసి ఉండలేనని.. విడాకులు కావాలంటూ చెంగల్ పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటీషన్ ఫైల్ చేసింది సంగీత.
నటుడు, రాజకీయ పార్టీ అధినేత అయిన విజయ్ నుంచి విడాకులు తీసుకోవటానికి కారణాలను.. తన పిటీషన్ లో స్పష్టంగా వివరించటం అనేది ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లోనే కాకుండా.. సినీ అభిమానుల్లోనూ చర్చనీయాంశం అయ్యింది.
విడాకులు కావాలంటూ విజయ్ భార్య సంగీత కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన తర్వాత.. ఇటీవల తమిళనాడు బీజేపీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బీజేపీ చీఫ్ నాగేంద్రన్ కు ఈ విషయం ముందే ఎలా తెలిసింది అనే మరో చర్చ తెరపైకి వచ్చింది. తమిళనాడు బీజేపీ చీఫ్ నాగేంద్రన్ ఏమన్నాడో ఓసారి చూద్దాం...
ALSO READ : విజయ్ భార్య విడాకుల పిటీషన్
తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ ఇటీవల విజయ్, నటి త్రిషపై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. విజయ్ త్రిష మత్తు నుంచి బయటకు రావాలని నాగేంద్రన్ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యాఖ్యలపై త్రిష ఘాటుగా రియాక్ట్ అయ్యింది.
తనకు రాజకీయాలతో సంబంధం లేదని.. తనపై నిరాధార ఆరోపణలు చేస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయ్, త్రిషపై చేసిన కామెంట్స్ దుమారం రేపుతుండటంతో నాగేంద్రన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.
