
సాధారణంగా పురుషులు, మహిళలకంటే పొడవుగా ఉంటారు. సగటున 5అంగుళాల పొడవుగా ఉంటారు. ఎందుకలా ఉంటారో ఎప్పుడైనా ఆలోచించారా..కొన్ని జాతుల్లో స్త్రీలు, పురుషులకంటే ఎత్తుగా ఉంటారు. స్త్రీపురుషుల మధ్య ఈ ఎత్తులో తేడాకు కారణాలేంటో ఏంటోతెలుసా.? చాలా రోజులుగా శాస్త్రవేత్తలు ఈ విషయంపై పరిశోధనలు జరుపుతున్నారు. తాజాగా స్త్రీపురుషుల మధ్య హైట్ లో తేడాకు కొన్ని సైంటిఫిక్ ఆధారాలను కనిపెట్టారు. ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం.. పురుషులు మహిళలకంటే పొడుగ్గా ఉండేందుకు ఓ జన్యువు కారణం అంటున్నారు పరిశోధకులు.. వివరాల్లోకి వెళితే..
ALSO READ | Cancer Disease: తొలి దశలోనే అన్ని రకాల క్యాన్సర్లను గుర్తించడం కష్టమే. కానీ..
నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్‌లో ప్రచురించబడిన ఓ కొత్త అధ్యయనం పురుషులు, మహిళలకంటే ఎందుకు పొడవుగా ఉంటారు అనే సుదీర్ఘ పరిశోధనలో కొత్త జన్యుపరమైన ఆధారాన్ని కనిపెట్టింది. ఈ అధ్యయనం ప్రకారం.. పురుషులు మహిళలకంటే పొడుగ్గా ఉండేందుకు SHOX జన్యువు (చిన్న పొట్టితన హోమియోబాక్స్) కీలక పాత్ర పోషిస్తుందట..ఇది ఎత్తును ప్రభావితం చేస్తుందని అంటారు.
సెక్స్ క్రోమోజోమ్‌లపై SHOXజన్యువు..
షాక్ జన్యువు X ,Y సెక్స్ క్రోమోజోమ్‌లపై ఉంటుంది. ఆడవారికి సాధారణంగా రెండు X క్రోమోజోములు (XX) ఉంటాయి.మగవారికి ఒక X ,ఒక Y క్రోమోజోమ్ (XY) ఉంటాయి.పురుషులు, స్త్రీల మధ్య ఎత్తు వ్యత్యాసంలో SHOX ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఆడవారిలో రెండు X క్రోమోజోములు ఉంటాయి. అయితే వీటిలో ఒకటి ఇనాక్టివ్ గా ఉంటుంది. దీనివల్ల SHOX జన్యువు పురుషులతో పోలిస్తే కొంత తక్కువ మోతాదులో ఉంటుంది. పురుషులలో X ,Y క్రోమోజోములు రెండూ యాక్టివ్ గా ఉంటాయి. రెండూ SHOX జన్యువు ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా పురుషులు SHOX జన్యువు ప్రభావాన్ని ఎక్కువగా పొందుతారు.
ఎత్తుపై SHOX జన్యువు ప్రభావం..
ఈ అధ్యయనంలో ఎత్తు పెరుగుదలకు Y క్రోమోజోములు ఎక్కువ దోహదం చేస్తాయని పరిశోధకులు కనుగోన్నారు. పురుషులు, మహిళల్లో SHOX జన్యు వ్యక్తీకరణలో వ్యత్యాసం చూపుతుందంటున్నారు. దీంతో పురుషులు, మహిళల మధ్య సగటు ఎత్తు వ్యత్యాసం సుమారు 5 అంగుళాలు అంటే ఇంచుమించు 20 నుంచి 25 శాతం ఉంటుందని లెక్కించారు.
ఈ అధ్యయనం స్త్రీపురుషుల మధ్య ఎత్తు వ్యత్యాసానికి SHOX ను ఓ ముఖ్యమైన జన్యకారకంగా హైలైట్ చేసినప్పటికీ ఇతర అంశాలు కూడా ఎత్తు లో తేడాకు దోహదం చేస్తాయి. సెక్స్ హార్మోన్లు, పురుష లైంగిక హార్మోన్లు, ముఖ్యంగా టెస్టోస్టిరాన్, యుక్త వయస్సులో ఎముకల పెరుగుదల, వాటి సాంద్రత కీలక పాత్ర పోషిస్తాయి. ఇది స్త్రీలకంటే పురుషులు ఎక్కువ ఎత్తు పెరగడానికి దారి తీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
SHOX జన్యువు పురుషులలో చాలా చురుకుగా ఉంటుంది.. ఇది జీవరసాయన శాస్త్రం కారణం కావచ్చని పెన్సిల్వేనియాలోని డాన్‌విల్లేలోని గీసింగర్ కాలేజ్ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో జన్యుశాస్త్ర పరిశోధకుడు..అధ్యయనం సీనియర్ రచయిత మాథ్యూ ఓట్జెన్స్ వివరించారు.SHOX జన్యువు స్థానం లైంగిక క్రోమోజోమ్‌ల చివరలో ఉంటుంది. ఆడవారిలో రెండు X లలో ఒకదానిపై ఉన్న చాలా జన్యువులు క్రియారహితంగా ఉంటాయి. ఫలితంగా స్త్రీపురుషుల మధ్య ఎత్తులో వ్యత్యాసంపై ప్రభావం ఉంటుందని చెప్పారు.
ఇక పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, జీవన శైలి కూడా ఎత్తు పెరగడంలో కీలకం. దాదాపు పది లక్షల మంది వ్యక్తుల జన్యు డేటా విశ్లేషించిన ఈ పరిశోధన.. స్త్రీపురుషుల మధ్య ఎత్తు వ్యత్యాసాలకు సెక్స్ క్రోమోజోములు ఎలా దోహదపడతాయో వివరణాత్మక అవగాహన కల్పిస్తోంది.
పురుషులు, స్త్రీల మధ్య ఎత్తులో సగటు వ్యత్యాసంలో దాదాపు పావు వంతు SHOX ప్రభావం ఉంటుందని పరిశోధకులు లెక్కించారు. మిగిలిన వ్యత్యాసంలో ఎక్కువ భాగం పురుష లైంగిక హార్మోన్ల ఇతర లక్షణాల వల్ల ఉంటుంది. ఇతర జన్యుపరమైన అంశాలు కూడా ఇందులో పాత్ర పోషిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.