అవాక్కయ్యారా.. : ఏంటీ.. సబ్బు తింటుందా.. నెటిజన్లు షాక్

అవాక్కయ్యారా.. : ఏంటీ.. సబ్బు తింటుందా.. నెటిజన్లు షాక్

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది.. అది ఏంటంటే.. ఓ మహిళ సబ్బు తింటుంది.. అవును.. చక్కగా ప్యాక్ చేసిన సబ్బును.. ఓపెన్ చేసి.. చాక్లెట్ తిన్నట్లు తింటుంది.. జస్ట్ 15 సెకన్లు మాత్రమే ఉన్న ఈ వీడియో క్యాప్షన్ చూసి నెటిజన్లు అందరూ అవాక్కవుతారు. ఓ చేతిలో సబ్బు.. మరో చేతిలో లిక్విడ్ సోప్ బాటిల్ చూపిస్తూ.. వీటిలో ఏది బెటర్ అంటూ కామెంట్ చేస్తుంది.. ఆ తర్వాత ఐ లవ్ సోప్ అంటూ.. ఆ సబ్బును తినేస్తుంది.. ఎంతో చక్కగా.. కేక్ తిన్నట్లు తినేస్తుంది.. అంత వరకు చూసిన నెటిజన్లు ఏంటీ.. సోప్ తింటుంది అని షాక్ అవుతారు.. ఆ తర్వాత.. అది సోప్.. సబ్బు కాదు.. సబ్బు లాంటి చాక్లెట్ కేకు అంటూ చాకుతో.. కట్ చేస్తుంది.. చివరి వరకు చూస్తేనే అసలు విషయం తెలుస్తుంది. 

Also Read :- తగ్గిన బంగారం, పెరిగిన వెండి 

ఇన్ స్ట్రా, రీల్ కోసం ఈ మహిళ ఇలా చేసినట్లు తెలుస్తుంది. దీనిపై డిఫరెంట్ గా స్పందిస్తున్నారు నెటిజన్లు. నెటిజన్లను మరీ ఇలా ఆడుకోవద్దంటూ కొందరు కామెంట్ చేస్తుంటే.. ఎండ్ వరకు చూస్తే క్లారిటీ వస్తుంది కదా అని మరి కొందరు సమర్థిస్తున్నారు. మరికొందరు అయితే రీల్స్ పిచ్చండీ.. పిచ్చి.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో అంటూ చురకలు అంటిస్తున్నారు.. మొత్తానికి సబ్బు లాంటి చాక్లెట్ కేక్ నెటిజన్లను మాత్రం షాక్ కు .. ఆ తర్వాత నవ్వులు పూయిస్తుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suchi Dutta (@21b_kolkata)