తగ్గిన బంగారం, పెరిగిన వెండి .. మార్కెట్లో కొత్త రేట్లు

తగ్గిన బంగారం, పెరిగిన వెండి .. మార్కెట్లో కొత్త రేట్లు

దేశవ్యాప్తంగా బంగారం ధరలు  తగ్గుముఖం పట్టాయి .  2023 అక్టోబర్ 05న   22 క్యారెట్ల 10 గ్రాముల  బంగారం ధర రూ. 190 తగ్గి రూ.  52 వేల 440కు చేరుకుంది.  ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల  బంగారం ధర రూ. 210 తగ్గి రూ.  57 వేల 160కు చేరుకుంది.  దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం.  

దేశ రాజధాని ఢిల్లీలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52 వేల 550 ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 57 వేల 310 గా ఉంది. అర్థిక రాజధాని ముంబైలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52 వేల 400ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 57 వేల 160 గా ఉంది.

హైదరాబాద్ లో   22  క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52 వేల 400ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 57 వేల 160 గా ఉంది.  విజయవాడలో  22  క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52 వేల 400 ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 57వేల 160గా ఉంది. 

బంగారం ధరలు తగ్గగా  వెండి ధరలు మాత్రం పెరిగాయి.  2023 అక్టోబర్ 04   గురువారం  రోజున రూ. 400 పెరిగిన  వెండి...  ప్రస్తుతం మార్కెట్ లో పది గ్రామల వెండి రూ. 735 గా ఉండగా, కేజీ వెండి రూ.  73 వేల  5 00గా పలుకుతోంది. చెన్నై, హైదరాబాద్  లలో  కేజీ వెండి రూ.  73 వేల  5 00గా పలుకుతుండగా, ముంబై, ఢిల్లీ,  కోల్ కత్తా లో రూ.  70 వేల 700 గా ఉంది.