కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి : సాగర్ ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి

కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి : సాగర్ ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి
  • ఎంపీ కుందూరు రఘవీర్​ రెడ్డి, సాగర్ ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి   

హాలియా, వెలుగు: కేటీఆర్​ నోటిని అదుపులో పెట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ని సీఎం రేవంత్​ రెడ్డిని విమర్శిస్తే బీఆర్​ఎస్​ను ప్రజలు తరిమికొడ్తారని నల్గొండ ఎంపీ కుందూరు రఘవీర్​ రెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి  హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారాల్లో భాగంగా ఆదివారం నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి కాంగ్రెస్​ అభ్యర్ధి చెరుపల్లి ముత్యాలు కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  10 ఏండ్ల పాలనలో తెలంగాణను అన్ని విధాలుగా దోచుకుని ప్రజలను వంచించిన బీఆర్‌‌ఎస్‌ను మున్సిపల్​ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు.  కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అభ్యర్ధి చెరుపల్లి ముత్యాలు, నాయకులు కాకునూరి నారాయణగౌడ్​, అంకతి సత్యం, వెంపటి శ్రీనివాస్,  కొండ శ్రీనివాసరెడ్డి, నరేందర్​తదితరులు పాల్గొన్నారు.