భూదందాలు, ఇసుక మాఫియాతో బాల్కసుమన్ కోట్లు వెనకేసుకుండు: మంత్రి వివేక్ వెంకట స్వామి

భూదందాలు, ఇసుక మాఫియాతో బాల్కసుమన్  కోట్లు వెనకేసుకుండు: మంత్రి వివేక్ వెంకట స్వామి

రాష్ట్రాన్ని దోచుకున్న  సంపాదనలో వాటాల కోసం  కేటీఆర్, కవిత మధ్య పంచాయతీ నడుస్తోందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కవిత,హరీష్ రావు,కేటీఆర్ లది రాజకీయ గొడవ కాదని.. కేసీఆర్ కుటుంబంలో ఆస్తుల పంచాయతీ నడుస్తుందన్నారు. ఆస్తిలో కవిత మహిళా కోట అడుగుతుందన్నారు మంత్రివివేక్.

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో మంత్రి వివేక్ వెంకటస్వామి మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.మున్సిపాలిటీలోని 6,7,8,10 వార్డుల్లో డోర్ డోర్ టు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.మున్సిపాలిటీలు వార్డులు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి వివేక్ మాట్లాడుతూ.. ‘ నేను  మార్నింగ్ వాక్ లో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని   పరిష్కరిస్తున్నా. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నపుడు బాల్క సుమన్ ఒక్కసారైనా వార్డుల్లో పర్యటించాడా? కేసీఆర్  చిన్న కొడుకునని చెప్పుకుంటూ బాల్క సుమన్ చెన్నూరు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు.ఎప్పుడు కేసీఆర్ ఇంట్లోనే ఉండేటోడు. సమస్యలను పట్టించుకోలేదు..అక్రమంగా భూ దందాలు,ఇసుక మాఫియాను పెంచి పోషించి వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. కమీషన్లు వచ్చే చోటే రోడ్లు,డ్రైనేజ్ లు పనులు చేసేవారు. నేను ఎమ్మెల్యే గా ఉన్నపుడు మౌలిక వసతుల పై దృష్టి పెట్టాను. 

చెన్నూరు నియోజకవర్గం లో 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లో డబుల్ బెడ్ రూంలు ఒక్క నిరుపేద కుటుంబానికి ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక రూ.. కోట్ల 50 లక్షలతో అమరవాది గ్రామంలో అభివృద్ధి పనులు జరిగాయి.  విశాఖ ట్రస్ట్ ద్వార అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నాం.  కాకా కుటుంబం ఎప్పటి  ప్రజా సేవకే అంకితం. ’అని అన్నారు వివేక్.