ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో ఫిబ్రవరి11న సెలవు

ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో  ఫిబ్రవరి11న సెలవు

నల్గొండ అర్బన్, వెలుగు: ఈ నెల11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్, మిర్యాలగూడ, హాలియా, నందికొండ, చండూరు, దేవరకొండ, చిట్యాల మున్సిపాలిటీల పరిధిలో పనిచేసే ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలకు ఈ నెల 11న స్థానిక సెలవు  దినంగా ప్రకటిస్తూ కలెక్టర్, ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కోసం వినియోగిస్తున్న విద్యాసంస్థలు, ప్రభుత్వ భవనాలు, ఇతర పబ్లిక్ బిల్డింగ్స్ అన్నింటికీ 10, 11 న స్థానిక సెలవు దినంగా ప్రకటించారు. ఓట్ల లెక్కింపులో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో(రామానందతీర్థ) ఉన్న నిడమనూరు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలకు ఈ నెల 11 నుండి 13 వరకు సెలవులు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.