టాలీవుడ్లో ఈ సమ్మర్లో రిలీజ్కు రెడీగా ఉన్న ఇంట్రస్టింగ్ మూవీ ‘నాగ బంధం’. ‘పెదకాపు’ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ‘మహా శివరాత్రి’ పర్వదినం సందర్భంగా ఆదివారం (ఫిబ్రవరి 15న) విడుదలైంది. టాలీవుడ్ స్టా్ర్ హీరో మహేష్ బాబు ఈ సినిమా టీజర్ను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. ‘నాగ బంధం’ టీజర్ అద్భుతంగా ఉందని.. ఈ సినిమాను థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు ఈ వారణాసి హీరో తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
నాగబంధం ద్వారా రక్షించబడుతున్న 108 విష్ణు దేవాలయాల బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ అవినాష్ ఇందులో అఘోరా పాత్రలో నటిస్తున్నాడు. జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్, అభే సంగీతం అందిస్తున్నారు.
‘నాగ బంధం’ సినిమా టీజర్ విజువల్గా చాలా రిచ్గా ఉంది. యాక్షన్ సన్నివేశాలతో టీజర్ను నింపేశారు. విరాట్ కర్ణకు మంచి ఎలివేషన్ షాట్స్ పడ్డాయి. నాగ బంధం టీజర్ చివర్లో.. పరమ శివుడి ఉగ్ర రూపంలో హీరో పాత్రను చూపించారు. ఈ టీజర్ ద్వారా కథేంటో చెప్పడం కంటే సినిమాలో ఉన్న యాక్షన్ సన్నివేశాలు, విజువల్ గ్రాండియర్ను ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేశారు.
ALSO READ : విజయ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్: అసెంబ్లీ ఎన్నికల తర్వాతే జన నాయగన్ రిలీజ్..?
వేల ఏళ్ల నాటి రహస్యం.. ఒక మనిషి స్వార్థం.. అతని స్వార్థం కారణంగా జరిగిన వినాశనం.. వినాశకాలే విపరీత బుద్ధి అని తెలియజెప్పే ప్రయత్నం.. సింపుల్గా ‘నాగ బంధం’ టీజర్లో దర్శకుడు చూపించిన.. చెప్పిన విషయం ఇది. కథ కంటే కూడా పోరాట సన్నివేశాలు ఎక్కువగా చూపించడంతో టీజర్ చూసిన ప్రేక్షకులకు యాక్షన్ జానర్ సినిమాలా అనిపించింది. ట్రైలర్తో కథను వివరించే ప్రయత్నం చేస్తారేమో చూడాలి.
