బెంగళూరు అంటేనే ట్రాఫిక్ జామ్. ఇక్కడ ట్రాఫిక్ కష్టాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు కానీ.. లిజ్ అనే ఓ జర్మన్ మహిళ బెంగళూరు ట్రాఫిక్ గురించి ఇన్ స్టాగ్రామ్‌లో చెప్పుకొచ్చింది. ఆమె ఇన్ స్టాగ్రామ్‌లో పెట్టిన ఈ వీడియో చూసి లోకల్ జనం మా మనసులో ఉన్న మాట చెప్పారు అంటున్నారు.
వీడియోలో ఎం ఉందంటే.. లిజ్ అనే మహిళ ఓ క్యాబ్ ప్రయాణంలో ఉన్నప్పుడు ఈ వీడియో తీసింది. బెంగళూరులో చిన్న చిన్న దూర ప్రయాణాలకి కూడా ఒక యుద్ధానికి సిద్ధమైనట్లు ప్లాన్ చేసుకోవాలని ఆమె చెబుతుంది. అలాగే ట్రాఫిక్ లో ఖాళీగా కూర్చోకుండా ఆఫీస్ పని చేసుకుంటు.. ఆకలేస్తే తినడానికి ఆమె తెచ్చుకున్న బాక్సులో ఫుడ్ తింటోంది. అంతేనా.... ఆఫీస్ మీటింగ్స్ అన్నీ క్యాబ్‌లోనే కానిచ్చేస్తోంది.
నేను తింటున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను, కాల్స్ మాట్లాడుతున్నాను.. అయినా సరే నేను ఇంకా చేరుకోలేదు. ఇక్కడి ట్రాఫిక్ అంత ఎక్కువగా ఉంటుంది అని వీడియోలో చెబుతుంది.
►ALSO READ | దృశ్యం సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు ఉండవు.. ఇంట్లో అందర్నీ చంపేసి మిస్సింగ్ కేసు.. పోలీసులకే చుక్కలు
ఈ వీడియోకి బెంగళూరు వాసులు రకరకాల కామెంట్స్ చేసారు. ఒకరైతే మేము బైక్ నడుపుతూ కూడా ల్యాప్‌టాప్‌లో పని చేస్తుంటాం అని అనగా... వర్షం పడితే ట్రాఫిక్ లోనే కాసేపు నిద్ర కూడా పోవొచ్చు అని ఇంకొకరు..... అసలు కొత్త ఐడియాలన్నీ ఈ ట్రాఫిక్ లోనే పుడతాయి, జీవితం గురించి ఆలోచించుకోవడానికి ఇక్కడ చాలా టైమ్ దొరుకుతుంది అని మరికొందరు కామెంట్స్ చేసారు.
బెంగళూరులో ఐటీ కంపెనీలు పెరిగిపోవడం, కోటి ముప్పై లక్షల పైగా జనాభా ఉండటంతో ఉదయం,సాయంత్రం రోడ్లన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. దీనికి తోడు మెట్రో పనులు, చాలిచాలని రోడ్లతో కిలోమీటర్ల దూరానికి కూడా గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తుంది.
