పక్క రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరిగితే మాకేంటి సంబంధం: షర్మిల ఫోన్ ట్యాపింగ్ పై జగన్ రియాక్షన్..

పక్క రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరిగితే మాకేంటి సంబంధం: షర్మిల ఫోన్ ట్యాపింగ్ పై జగన్ రియాక్షన్..

తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఏపీ పాలిటిక్స్ లో హీట్ పెంచుతోంది. ఏపీకి చెందిన ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయంటూ ఆరోపణలు వినిపిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో జగన్ తన ఫోన్ కూడా ట్యాప్ చేయించారంటూ ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. గురువారం ( జూన్ 19 ) షర్మిల వ్యాఖ్యలపై స్పందించిన వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరిగితే మాకేంటి సంబంధమని అన్నారు. షర్మిల అప్పట్లో క్రియాశీలకంగా ఉందని చేశారేమోనని అన్నారు జగన్. 

అసలు ఫోన్ ట్యాపింగ్ చేసారో లేదో మాకేలా తెలుస్తుందని అన్నారు జగన్. ఇదిలా ఉండగా ఏపీ, తెలంగాణ మధ్య నీటి వివాదంపై స్పందించిన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటి వాటాలకు సంబంధించి జగన్ స్పందించారు. గోదావరి నీటిని కృష్ణా బేసిన్ కు తరలించటం ద్వారా శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులపై ఒత్తిడి తగ్గుతుందన్నారు. పోలవరం కెనాల్స్ ద్వారా ఎక్కువ నీటిని పంప్ చేయగలిగితే.. నాగార్జునసాగర్ డ్యాంపై ఒత్తిడి తగ్గుతుందని.. అప్పుడు శ్రీశైలం ప్రాజెక్ట్ లోని నీటి వాటాను రాయలసీమకు పూర్తిగా వాడుకోవచ్చన్నారు. 

తెలంగాణలో తనను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకు ఫోన్ ట్యాపింగ్ జగన్, కేసీఆర్ ఇద్దరు కలిసి ఫోన్ ట్యాపింగ్ స్కెచ్ వేశారని షర్మిల ఆరోపించారు.బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్న..ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం..తన ఫోన్, తన భర్త, కుటుంబ సభ్యులను ట్యాపింగ్ చేశారన్నారు షర్మిల. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో దర్యాప్తు ముమ్మరం చేయాలని షర్మిల కోరారు. 

►ALSO READ | శ్రీవారి ఆలయాల్లోని హుండీల్లో వేసిన సెల్ ఫోన్లు ఈ- వేలం : ఆన్ లైన్ లో ఇలా పాల్గొనవచ్చు..

రెండు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలన్నారు షర్మిల. అనాడు జగన్, కేసీఆర్ మధ్య ఉన్న సంబంధం చూసి.. రక్త సంబంధం కూడా చిన్నబోయింది. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు వైవీ సుబ్బారెడ్డే స్వయంగా చెప్పారని.. ఆనాడు ట్యాపింగ్ జరిగిన ఓ ఆడియోను నాకు వినిపించారన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మన్నా వస్తానన్నారు షర్మిల.