సినీ ఇండస్ట్రీలో మరో విషాదం కలిచివేస్తుంది. ‘హీరోస్’ సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ నటి హేడెన్ పనెట్టియర్ (36) కన్నుమూశారు. ఆగస్టు 21న 37వ పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉండగా, అందుకు కొద్ది రోజుల ముందే ఆమె మృతి చెందడం అభిమానులను, సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హేడెన్ మరణాన్ని ఆమె తండ్రి స్కిప్ పనెట్టియర్ ఓ ప్రకటన ద్వారా ధృవీకరించారు.
“హేడెన్ మృతి వార్తను అత్యంత విషాదంతో తెలియజేస్తున్నాం. ఆమె అద్భుతమైన ప్రతిభావంతురాలు. తనను కలిసిన వారితో పాటు, తెరపై ఆమెను చూసిన కోట్లాది మందికి అపారమైన ప్రేమ, ఆనందాన్ని పంచారు” అని ఆయన పేర్కొన్నారు. అయితే, ఆమె మరణానికి సంబంధించిన పరిస్థితులు, కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం.
Actress Hayden Panettiere has tragically passed away at the age of 36.
— Styke (@styke_ajc) August 17, 2026
Panettiere, widely recognized for her memorable performances in the hit NBC series Heroes and the musical drama Nashville, was remembered as a remarkable light and a true force of nature.
Her representative… pic.twitter.com/FZ7aaQShLs
కాస్టింగ్ కౌచ్‌పై గళం విప్పిన హేడెన్..
బాలనటిగా కెరీర్ ప్రారంభించిన హేడెన్.. ‘హీరోస్’, ‘నాష్విల్’, ‘స్క్రీమ్ 4’ వంటి చిత్రాలు, సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్నారు. తన జీవితంలో ఎదుర్కొన్న వ్యక్తిగత సమస్యలు, హాలీవుడ్‌లోని చీకటి కోణాలు, కాస్టింగ్ కౌచ్‌పై కూడా ఆమె గతంలో సంచలన విషయాలు వెల్లడించారు. ఇదే ఏడాది విడుదలైన తన జ్ఞాపకాల పుస్తకం ‘దిస్ ఈజ్ మీ: ఎ రెకనింగ్’లో హేడెన్ తన జీవితంలో ఎదుర్కొన్న పలు కఠిన అనుభవాలను వెల్లడించారు. వ్యసనం, ప్రసవానంతర డిప్రెషన్‌తో పోరాటం గురించి కూడా ఆమె పంచుకున్నారు.
►ALSO READ | Ramayana: ‘రామాయణం’ రూ.4 వేల కోట్ల బడ్జెట్‌పై యష్ క్లారిటీ.. లెక్కలన్నీ బయటపెట్టిన రాకింగ్ స్టార్!
అదే పుస్తకంలో హాలీవుడ్‌లోని ఓ ప్రముఖ అవార్డు గ్రహీత నటుడి నుంచి ఎదురైన అసభ్య ప్రవర్తన గురించి కూడా ఆమె సంచలన విషయాలు వెల్లడించారు. ఈ ఘటనతో పాటు పరిశ్రమలోని చీకటి కోణాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. 36 ఏళ్ల వయసులోనే హేడెన్ కన్నుమూయడం హాలీవుడ్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
బాలనటిగా కెరీర్ ప్రారంభం..
హేడెన్ కేవలం నాలుగేళ్ల వయసులోనే ‘One Life to Live’ సిరీస్‌తో బాలనటిగా కెరీర్ ప్రారంభించారు. అనంతరం ‘A Bug’s Life’లో డాట్ పాత్రకు వాయిస్ అందించారు. డెంజెల్ వాషింగ్టన్‌తో కలిసి నటించిన ‘Remember the Titans’ సినిమాతో ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది. 2006–2010 మధ్య ప్రసారమైన ‘హీరోస్’ సైన్స్‌ఫిక్షన్ సిరీస్‌లో క్లైర్ బెన్నెట్ పాత్రతో అంతర్జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు పొందారు. అనంతరం ‘నాష్విల్లే’ సిరీస్‌లో జూలియట్ బార్న్స్ పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు. ‘రిమెంబర్ ది టైటాన్స్’, ‘రైజింగ్ హెలెన్’, ‘ఐస్ ప్రిన్సెస్’, ‘స్క్రీమ్ 4’ వంటి సినిమాల్లోనూ ఆమె నటించారు. ‘కింగ్డమ్ హార్ట్స్’, ‘అంటిల్ డాన్’ వంటి వీడియో గేమ్స్‌లో పాత్రలకు వాయిస్ అందించారు.
►ALSO READ | Ananya Raj: ఏడాదిగా ఇంత నరకం అనుభవించిందా? హీరోయిన్ అనన్య రాజ్ మృతికి కారణాలివే...!
సినీ ప్రముఖుల సంతాపం..
హేడెన్ మృతిపై ఆమె సహనటి మెలిస్సా బర్రెరా, గాయని జోజో, నటి సెల్మా బ్లెయిర్ తదితరులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. నటీనటుల సంఘం SAG-AFTRA కూడా హేడెన్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు సానుభూతి తెలిపింది. 36 ఏళ్ల వయసులో హేడెన్ పనెట్టియర్ మృతి హాలీవుడ్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
