ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పిన మెగాస్టార్ 

ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పిన మెగాస్టార్ 

మెగాస్టార్ చిరంజీవి కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇటీవల కోవిడ్ సోకి ఐసొలేషన్ లోకి వెళ్లిన చిరు ఆరోగ్యం కుదుటపడటంతో తిరిగి తన సినిమాల్ని స్టార్ట్ చేశారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు మెగాస్టార్. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించినవారందరికి మనస్పూర్తిగా ధన్యవాదాలు చెప్పారు. షూటింగ్ సెట్‏లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు చిరు. పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది.. మళ్లీ పనిలో పడ్డాను, మళ్లీ యాక్షన్ మొదలైందంటూ ట్వీట్ చేశారు. చిరంజీవి ప్రకటనతో ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

మరిన్ని వార్తల కోసం

దైవం ముందు ప్రజలు, భక్తులు అందరూ ఒక్కటే

తెలుగు సినిమాపై ప్రధాని మోడీ ప్రశంసలు