మలేషియా నుంచి విశాఖకు 185 మంది స్టూడెంట్స్

మలేషియా నుంచి విశాఖకు 185 మంది స్టూడెంట్స్
  •                 ఎవ్వరికీ కరోనా లక్షణాలు లేవని తేల్చిన డాక్టర్లు

మలేసియాలో చిక్కుకున్న 185 మంది ఇండియన్ స్టూడెంట్లు బుధవారం ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకున్నారు. డాక్టర్లు నాలుగు టీమ్​లుగా  ఏర్పడి వీరికి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. వీరిలో తెలంగాణకు చెందిన వారు 10 మంది ఉండగా, ఏపీకి చెందిన వారు 91 మంది, ఇద్దరు కేరళ, ముగ్గురు మహారాష్ట్ర, ఒడిశాకు చెందిన వారు ఒకరున్నారని ఏసీపీ స్వరూప మీడియాకు తెలిపారు. వీరందరికీ కేటగిరీల వారీగా టెస్టులు నిర్వహించామని, ఎవరికీ కరోనా లక్షణాలు లేవని తేలిందని చెప్పారు. వీరందరినీ బందోబస్తుతో ఇళ్లకు పంపించామని, 14 రోజులు హోం ఐసోలేషన్ లో ఉండాలని సూచించినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన స్టూడెంట్లను ప్రత్యేక వెహికల్స్ లో తరలించామని, ఆయా రాష్ట్రాల ఆరోగ్యశాఖ అధికారులకు వాళ్లను అప్పగిస్తామని చెప్పారు.

కరోనా ఎఫెక్టుతో ఫారినర్స్ అంతా 72 గంటల్లో దేశం విడిచి పోవాలన్న ఫిలిప్పీన్స్ ఆదేశాల మేరకు రెండ్రోజుల కిందట అక్కడి నుంచి బయల్దేరిన 185 మంది ఇండియన్ స్టూడెంట్లు కౌలాలంపూర్‌ ఎయిర్ పోర్టులో చిక్కుకున్నారు. మలేసియా అధికారులతో చర్చలు జరిపిన కేంద్రం.. స్టూడెంట్లను స్వదేశానికి రప్పించింది.