వైరల్ అవుతున్న కౌశిక్ రెడ్డి మరో ఆడియో

వైరల్ అవుతున్న కౌశిక్ రెడ్డి మరో ఆడియో

కరీంనగర్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి మరో ఆడియో వెలుగులోకి వచ్చింది. తాజాగా జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన తిరుపతి అనే స్థానిక నాయకుడికి చేసిన ఫోన్ కాల్ వైరల్ గా మారింది. స్థానికంగా వైరల్ అవుతున్న మరో ఆడియోలో టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్నట్లు కౌశిక్ రెడ్డి చెప్పుకున్నారు. 
హుజురాబాద్ నియోజకవర్గ నాయకులకు ఫోన్లు చేస్తూ మద్దతు కోరుతున్నారు కౌశిక్ రెడ్డి. ఈ ఆడియోలో టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్నా అని చెబుతున్నారు. మిమ్మల్ని స్వయంగా వచ్చి కలుస్తానంటూ కాంగ్రెస్ నాయకులను తన వెంట తీసుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.