‘వెలుగు’ ఫొటోగ్రాఫర్లకు అవార్డులు

‘వెలుగు’ ఫొటోగ్రాఫర్లకు అవార్డులు

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో తెలంగాణ ఫొటోగ్రాఫర్స్ జర్నలిస్టు అసోసియేషన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల అవార్డులను శుక్రవారం ప్రకటించారు. 2022 ఏడాదిగానూ ‘వెలుగు’ ఫొటోగ్రాఫర్లు దుబ్బాక సురేష్ రెడ్డి, ఓరిగంటి సురేష్ గౌడ్, మహిమల భాస్కర్ రెడ్డికి, 2023 ఏడాదికిగానూ జెల్ల నవీన్, భానుతేజకు అవార్డులు దక్కాయి. జెల్ల నవీన్​కు బెస్ట్ న్యూస్ పిక్చర్ కేటగిరీలో మూడో బహుమతి, మిగతా వారు కన్సోలేషన్ అవార్డులు సొంతం చేసుకున్నారు. రేపు రవీంద్రభారతిలో మంత్రి హరీశ్ రావు ఈ అవార్డులను అందజేయనున్నారు. 

నేషనల్ ఫొటో కాంటెస్టులోనూ..  

ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా నిర్వహించిన నేషనల్ ఫొటో కాంటెస్ట్–2023లో వెలుగు ఫొటోగ్రాఫర్ రావుట్ల శ్యామ్​కుమార్​కు అవార్డు దక్కింది. ‘మై ఇండియా థీమ్’​లో భాగంగా శ్యామ్ కుమార్ తీసిన  ట్యాంక్​బండ్​పై ఉన్న ఆర్మీ ఎమ్‌‌47 పాటన్ ట్యాంక్ పై జాతీయ జెండాలతో జనం ఉన్న ఫొటోకుగానూ ఈ అవార్డు వచ్చింది. శుక్రవారం విజయవాడలోని ఎంజీరోడ్ బాలోత్సవ్ భవన్​లో  ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, మాజీ ఎంపీ గోకరాజు రంగరాజు  చేతుల మీదుగా శ్యామ్ అందుకున్నారు. 

– వెలుగు, హైదరాబాద్