రండి బాబు.. రండి: రూ.80 లకే ఇల్లు!

రండి బాబు.. రండి: రూ.80 లకే ఇల్లు!

హెడ్డింగ్ చదివి… అబ్బా! ఓ ఇండి వాడిని కావాలన్న నా కల ఇంత కారుచౌకగా తీరుతుందనుకోలేదు అంటూ మురిసిపోకండి . ఓ పది పదిహేను ఇండ్లు కొనిపడేద్దా మని తొందర పడకండి . ఇల్లు కొనాలని డి సైడ్ అయ్యే ముం దు.. ఇంతకీ ఇంత తక్కువ ధరకు ఇండ్లు ఎందుకు అమ్ముతున్నరు? అవి ఎక్కడున్నయ్ ? కొనాలంటే ఏమైనా టెర్మ్స్ అండ్ కండి షన్లు ఉన్నయా? నిజంగా ఆ ఇండ్లను కొం టే మనకు ఉపయోగమేనా? ఇలా అన్నిరకాలుగా ఆలోచించి, ఓ డిసిషన్ తీసుకోండి.

సొంతిల్లు ప్రతిఒక్కరి కల. ఆ కలను నెరవేర్చుకునేందుకు ఎందరో ఎన్నెన్నో కష్టాలు పడుతుంటరు. నెలనెలా తమ సంపాదనలో నుంచి కొంత సొమ్ము దాచిపెట్టి, చిట్టీలు కట్టి, బ్యాంకు నుంచి లోన్ తీసుకొని ఇల్లు కొనేందుకు ప్లాన్ చేస్తుంటరు. కిరాయి ఇంట్లో ఉండి నెలనెలా రెంట్ కట్టే బదులు.. ఓ ఇల్లు కొనుక్కొ ని దాని ఈఎంఐ కట్టడమే బెటర్ అనుకుంటరు. నిజానికి ఇది చాలా మంచి ఆలోచనే. కానీ ముందువెనక ఆలోచించకుండా ఇల్లు కొనే సి, దాని ఈఎంఐ కట్టలేక అవస్థలు పడేవారు కూడా చాలామందే ఉంటారు. చివరకు అంతవరకు కట్టిన డబ్బులు, ఇల్లును వదిలేసి వెళ్లిపోయినవారు కూడా ఎంతో మంది. ఇందంతా ఎందుకంటే.. ఇల్లు కొనేముందు అన్నిరకాలుగా ఆలోచించే కొనాలనేది
అనుభవజ్ఞులు చెప్పే మాట. ఇదే మాటను ఇంకోసారి గుర్తుచేస్తున్నం. ఎందుకంటే 80 రూపాయలకే ఇల్లును అమ్ముతున్నరంటే దాని వెనుక ఏదో మర్మముంటది. అది తెల్సుకొని ముందడుగేస్తే మంచిది. ఇక అసలు విషయంలోకి వెళ్తే..

పొట్టకూటి కోసం పల్లెలను వదిలి పట్నంకు పోయి బతుకుతున్నోళ్ల సంఖ్య బాగా పెరుగుతున్నది. దీంతో పల్లెలన్నీ మొండి గోడలతో ఖాళీగా కనిపిస్తున్నయ్ . ఇది మనదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇట్లనే ఉందట. ఇటలీలోని సిసిలీ ద్వీపంలో సంబూకా అనే విలేజ్ ఉంది. మనం
చెప్పుకుంటున్న 80 రూపాయలకే ఇల్లు అమ్ముతున్నది ఈ ఊర్లోనే . ఎందుకంటే ఈ ఊళ్లో ఉన్నోళ్లంతా బతుకుదెరువుకోసం నగరాలకు వెళ్లిపోయిన్రట. దీంతో ఈ ఊరు మొత్తం ఇప్పుడు ఖాళీ అయ్యింది. యూరప్ లోని చిన్న చిన్న పట్టణాలు, ఊర్లు చాలానే ఖాళీ అవుతున్నయ్. దీంతో అక్కడి ప్రభుత్వం పల్లెలను మళ్లీ ప్రజలతో నింపేందుకు కొత్త పథకాన్ని ప్రకటించింది. అందే ‘ఒక్క యూరోకే ఇల్లు ’ పథకం. అంటే ఒక్క యూరో మన రూపాయాల్లో దాదాపు 80 రూపాయలతో సమానం.

ఒకప్పుడు లక్షల్లో ఉన్న ఈ సంబూకా జనాభా ఇప్పుడు 5,800 మందికి పడిపోయింది. అన్నిరకాల సదుపాయాలున్నా కూడా బతుకుదెరువు లేక ఇలా ఊరు విడిచి వెళ్లిపోతున్నరు. అయితే అక్కడి ప్రజలకు ఉపాధి కల్పించేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం కనిపించడం లేదు. దీంతో పెద్ద పెద్ద భవనాలుసైతం ఉండేవారు లేక బోసిపోతున్నయ్. కొన్ని ఇప్పటికే మెయింటెనెన్స్​ లేక శిథిలావస్థకు చేరినయ్. కనీసం ఇండ్లను
కాపాడుకుంటే ఎప్పటికైనా ప్రజలు తిరిగి వస్తరనే ఆశతోనే అక్కడి గ్రామ పాలక సంస్థ ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఖాళీగా ఉన్న, పాతబడిపోయిన, శిథిలావస్థకు చేరిన ఇళ్లను కొనుగోలు చేసింది. వాటిని కొత్తవారికి కేవలం ఒక్క యూరోకే అమ్ముతామని ప్రకటించింది.

కండిషన్స్ అప్లయ్ ..

ఇటలీకి చెందినవారే ఇక్కడ ఇండ్లను కొనుక్కోవాలని ఏమీ లేదు. ప్రపంచంలో ఏ దేశానికి చెందినవారైనా ఇక్కడ ఇండ్లను కొనుక్కోవచ్చు. సంబూకాలోని నివసించవచ్చు. అయితే ఓ కండిషన్ ..! ఇల్లు కొనుక్కున్నవారు మూడేళ్లలోగా దానికి రిపేర్లు చేయించుకోవాలి. రంగులు వేయించుకోవాలి. సుందరంగా రండి బాబు.. రండి.. హెడ్డింగ్ చదివి… అబ్బా! ఓ ఇంటి వాడిని కావాలన్న నా కల ఇంత కారుచౌకగా తీరుతుందనుకోలేదు అంటూ మురిసిపోకండి . ఓ పది పదిహేను ఇండ్లు కొనిపడేద్దా మని తొందర పడకండి. ఇల్లు కొనాలని డిసైడ్ అయ్యే ముం దు.. ఇంతకీ ఇంత తక్కువ ధరకు ఇండ్లు ఎందుకు అమ్ముతున్నరు? అవి ఎక్కడున్నయ్ ? కొనాలంటే ఏమైనా టెర్మ్స్ అండ్ కండిషన్లు
ఉన్నయా? నిజంగా ఆ ఇండ్లను కొంటే మనకు ఉపయోగమేనా? ఇలా అన్నిరకాలుగా ఆలోచించి, ఓ డిసిషన్ తీసుకోండి. తీర్చి దిద్దుకోవాలి. లేదంటే ఆ ఇల్లు మళ్లీ గ్రామపాలక సంస్థ స్వాధీనం చేసుకుంటుంది.

కోడికంటే మసాలా ఖర్చే ఎక్కువ..

కోడి ఫ్రీగా వచ్చిందని తెచ్చుకుంటే.. దానిని కూరగా వండేందుకు మసాలాల ఖర్చే తడిసి మోపెడైందన్నట్లుంది ఇటలీ ఇండ్ల కథ. ఇల్లు తక్కువ ధరకే వస్తుందని కొంటే.. దానిని రిపేర్ చేసేందుకు బాగానే ఖర్చు పెట్టాల్సి వస్తది. ఎందుకంటే ఏళ్ల తరబడి ఎవరూ లేకుండా ఉండేసరికి అవి పాడుబడ్డ ఇండ్లుగా తయారైనయ్. దీంతో కొనేందుకు వచ్చినవారు వాటి రిపేర్ కు అయ్యే ఖర్చును చూసి వెనక్కు వెళ్లిపోతున్నరట. అయినా కొంటున్నరు..సంబూకా గ్రామ పాలక సంస్థ పెట్టిన షరతును ఒప్పుకొని కొందరు విదేశీయులు ఇప్పటికే ఈ గ్రామంలో ఇండ్లను కొన్నరు. ఇప్పటిదాకా 1800 ఇండ్లు అమ్ముడు పోయినయని సంబూకా మేయర్ లియోనార్డో సికాసియో చెప్పిండు. మరికొంత మంది కూడా కొనేందుకు రెడీగా ఉన్నరట. అయితే పర్మినెంట్ గా ఇక్కడే ఉండేందుకు కాకుండా గెస్ట్​ హౌస్ గా ఉపయోగించుకునేందుకే కొంటున్నరట.

టూరిజం స్పాట్ ..

నిజానికి సంబూకా గ్రామం సిసిలీ ద్వీపంలోనే అందమైన ఊరు. దీనిని టూరిజం స్పాట్ గా డెవలప్ చేస్తే ఎంతోమంది టూరిస్టులు ఇక్కడికి వచ్చి హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తరని చెబుతున్నారు. అయితే అక్కడి ప్రభుత్వం, గ్రామ పాలక సంస్థ ఆ దిశగా ఆలోచించకపోవడంతోనే ఊరు మొత్తం
మొండిగోడలతో మిగిలే పరిస్థితి తలెత్తిందని చెబుతున్నరు. ఇప్పటికైనా మంచి టూరిస్ట్​ ప్లేస్ గా తీర్చి దిద్దాలని అక్కడ ఇండ్లు కొన్నవారు
కోరుతున్నరు. ఇప్పటికే ఇక్కడ ఇండ్లు కొన్నవారిలో ఎక్కువ మంది మ్యుజీషియన్స్​, డాన్సర్స్​, జర్నలిస్టులు, రచయితలు ఉన్నరట. వాళ్లకు మంచి అభిరుచులున్నాయని, ప్రకృతి సౌందర్యాన్ని గొప్పగా ఆస్వాధిస్తున్నారని మేయర్ చెబుతున్నడు. మీరూ నేచర్ లవర్స్
అయితే ‘ఒక్క యూరోకే ఇల్లు ’ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంటున్నడు.

ఎంతో కలుపుగోలు మనుషులు

సంబూకా గ్రామంలోని ప్రజలు కూడా ఎంతో కలుపుగోలుగా ఉంటరు. కొత్తవారు ఊరికి వస్తే ఎంతో ఆప్యాయతతో పలకరిస్తరు. అవసరమైన
సాయం చేయడానికి ముందుకొస్తరు. అందుకే ఈ గ్రామంలో ఇండ్లు కొనేందుకు చుట్టుపక్కల పట్టణాలకు చెందిన ప్రజలే ఎక్కువగా ఆసక్తి
చూపుతున్నరట. సరదాగా గడిపేందుకు ఎక్కడికో వెళ్లే బదులు సంబూకాలో ఓ ఇల్లు కొనుక్కొని, అందులో వీకెండ్స్​ గడిపితే బాగుంటుందని ఆలోచిస్తున్నరట.

ఊరును కాపాడుకుందం

చేతులు కాలినంక ఆకులు పట్టుకోని ఏం లాభం. ఊరును కాపాడుకునే ఆలోచన ముందు నుంచి చేస్తే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా.
ఇది ఇటలీలోని సంబూకా ఊరికే పట్టిన దుస్థితి కాదు. రేపోమాపో మన ఊర్లన్నీ కూడా మరో సంబూకాలుగా మారిపోవడానికి ఎన్నోరోజులు
పట్టదు. ఊర్లోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించగలిగితే బతుకుదెరువు కోసం పట్నం పొయ్యే ఆలోచన ఎవరూ చెయ్యరు.