
మల్కాజిగిరి, వెలుగు : లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌సందర్భంగా బహుదూర్ పురాలోని ఓ పోలింగ్‌బూత్‌లో రిగ్గింగ్ కు పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేసిన కేసులో సీసీఎస్ పోలీసులు మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్‌కుమార్‌తోపాటు మరో నలుగురిని అరెస్ట్‌చేశారు. సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో విచారిస్తున్నారు. ఈసీ ఫిర్యాదు మేరకు విచారణ కొనసాగుతోంది. ఈ విషయాన్ని సీసీఎస్పోలీసులు గురువారం రాత్రి వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే నాంపల్లికి చెందిన మహ్మద్ బీన్ అలీ, చాదర్రఘాట్ కు చెందిన కాశీ, ముషీరాబాద్ కు చెందిన మితిలేశ్ కోర్టులో హాజరుపరిచామన్నారు.
కార్పొరేటర్శ్రావణ్పాత్రపై విచారణ కొనసాగుతోందని, శుక్రవారం ఉదయం కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే సీసీఎస్పోలీసులు గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో కార్పొరేటర్శ్రావణ్కుమార్ను అదుపులోకి తీసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఎలాంటి సమాచారం లేకుండా ప్రైవేట్వెహికల్లో ఎక్కించి తరలించడాన్ని చూసి, స్థానికులు, కార్పొరేటర్కుటుంబ సభ్యులు శ్రావణ్‌ను కిడ్నాప్‌చేశారని అనుకున్నారు. కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని వాకబు చేయగా, తమకు ఏమీ తెలియదని అక్కడి పోలీసులు చెప్పారు.
దీంతో శ్రావణ్తండ్రి రాంబాబు మల్కాజిగిరి పీఎస్‌లో తన కొడుకును గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌చేశారని ఫిర్యాదు చేశారు. అదే సమయంలో బీజేపీ శ్రేణులు పోలీస్స్టేషన్ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. కొద్దిసేపటి తర్వాత స్పందించిన మల్కాజిగిరి పోలీసులు కార్పొరేటర్శ్రావణ్ను సీసీఎస్పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. దీంతో వారంతా బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కు చేరుకుని అక్కడ ఆందోళనకు దిగారు. ఆందోళన అర్ధరాత్రి వరకు కొనసాగుతూనే ఉంది. కాగా శ్రావణ్‌కుమార్‌పై గతంలో పలు కేసులు నమోదు అయినట్లు తెలిసింది.