- ఖతార్ చమురు, ఎల్ఎన్జీకి ఆటంకం కలుగొద్దు
- ఇరాన్ కు సూచించిన చైనా
బీజింగ్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో హార్ముజ్ జలసంధి గుండా నౌకా రవాణాకు అంతరాయం కలగొద్దని చైనా ఇరాన్ కు సూచించినట్టు సమాచారం. ముఖ్యంగా ఖతార్ నుంచి జరిగే చమురు, ఎల్ఎన్జీ ఎగుమతులను లక్ష్యం గా చేసుకోవద్దని తెలిపిందని బూమ్ బర్గ్ ఓ కథనాన్ని ప్రచురించింది.
ఇరాన్ ఉత్పత్తి చేసే చమురులో మెజారిటీ భాగాన్ని చైనానే కొనుగోలు చేస్తోంది. అయితే చైనా మొత్తం ఇంధన అవసరాల్లో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంపై భారీగా ఆధారపడుతోంది. ఖతార్ ప్రపంచ ఎల్ఎన్జీ సరఫరాలో సుమారు ఐదవ వంతు వాటా కలిగి ఉండగా.. చైనా దిగుమతుల్లో దాదాపు 30 శాతం ఖతార్ నుంచే వస్తోంది.
అమెరికా- ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతిదాడుల క్రమంలో జలసంధిలో ట్యాంకర్ రవాణా మందగించగా, ఆసియా దేశాలు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం ప్ర యత్నాలు ప్రారంభించాయి. ఈ పరిస్థితిపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో మాట్లాడి, పొరుగుదేశాల ఆందోళనలను పరి గణనలోకి తీసుకోవాలని సూచించినట్లు చైనా ప్రకటించింది.
